గ్యాస్ సమస్య అనేది సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. దీని వల్ల పొట్టంతా ఉబ్బినట్లు అనిపిస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. దీంతో ఆకలి వేయదు. ఏ ఆహారం తినబుద్ధి అనిపించదు. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఒక సూపర్ ఫుడ్ ఉంది. అదేమిటంటే..
నిత్యం చాలా మంది పెరుగును తింటుంటారు. పెరుగులో అనేక పోషకాలు ఉంటాయి. దీన్ని కొందరు భోజనం చివర్లో తింటారు. పెరుగు తినకుండా కొందరు భోజనాన్ని పూర్తి చేయరు. అయితే గ్యాస్ సమస్యను తగ్గించేందుకు పెరుగు బాగా ఉపయోగపడుతుంది.
గ్యాస్ సమస్య మనం తినే ఆహారాల వల్ల వస్తుంది. లేదా సమయానికి భోజనం చేయకపోయినా, శారీరక శ్రమ చేయకపోయినా, పలు రకాల మందులను వాడినా ఈ సమస్య వస్తుంది. కానీ పెరుగు వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
పెరుగులో కొద్దిగా నీరు పోసి గుజ్జుగా కలపాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, కీరదోస ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా తిప్పాలి. రుచి కోసం కొద్దిగా ఉప్పు కలప వచ్చు. అనంతరం ఆ పెరుగును తాగేయాలి. భోజనం చేసిన తరువాత పెరుగును ఈ విధంగా తీసుకుంటే ఎంతో ఉపయోగం కలుగుతుంది.
పెరుగును పైన తెలిపిన విధంగా తీసుకోవడం వల్ల గ్యాస్ ఏర్పడదు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం ఉండదు. అయితే పెరుగులో పండ్లను కలిపి కూడా తీసుకోవచ్చు. దీని వల్ల కూడా గ్యాస్ తగ్గుతుంది.