చిట్కాలు

Gas Trouble : గ్యాస్ ట్రబుల్ వుందా..? ఇలా చేయండి.. అస్సలు ఈ సమస్య రానే రాదు..!

Gas Trouble : చాలా మంది, రకరకాల ఇబ్బందులతో బాధ పడుతూ ఉంటారు. ఈరోజుల్లో ఆహారపు అలవాట్లలో చాలా మార్పు వచ్చింది. పైగా, ఆరోగ్యానికి హాని చేసే ఆహారాలను కూడా, ఎక్కువ మంది తీసుకుంటున్నారు. దీనితో, ఎక్కువ మంది అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కడుపులో ఇబ్బందిగా ఉండడం, లేదంటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడం, ఛాతిలో మంట, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంగా అనిపించడం ఇటువంటివి చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు.

కొన్నిసార్లు, నోటి నుండి లేదా కింది నుండి గ్యాస్ రిలీజ్ అవచ్చు కూడా. ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే, ఖచ్చితంగా అది గ్యాస్ సమస్య అని చెప్పొచ్చు. ఇటువంటి సమస్యలు ఉంటే, గ్యాస్ పైన లేదా గ్యాస్ పట్టేసింది అని అంటూ ఉంటారు. తిన్న ఆహారం తిరగడానికి, మన కడుపులో కొన్ని ఆసిడ్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఆసిడ్స్ రిలీజ్ అయ్యే లోపు ఆహారాన్ని తినాలి.

if you have gas trouble then do like this

లేక పోతే యాసిడ్ మన జీర్ణాశయ గోడల పైన రిలీజ్ అయిపోయి. కడుపులో మంట, నొప్పి వంటి వాటిని కలిగిస్తాయి. టైం లేదు అని తినకపోవడం, ఆసక్తి లేక అనో, లేకపోతే ఆకలి వేయట్లేదు అని అలా తినడం మానేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన ఇబ్బందులు కలుగుతాయి. ఒకవేళ కనుక ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే, డాక్టర్ల సలహా తీసుకొని మీరు మందులు వాడొచ్చు.

దాని కంటే కూడా, గ్యాస్ సమస్యలు రాకుండా ఉండాలంటే, ముందు టైం కి తినేయాలి. అలా కాకుండా తినడం స్కిప్ చెయ్యద్దు. ఈ తప్పు చేస్తే మాత్రం గ్యాస్ సమస్య ఎక్కువ అవుతుంది. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్, ఓమోప్రజలే, రాబిప్రజాల్ వంటివి డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది. కానీ, ముందు సమస్య రాకుండా జాగ్రత్త పడడానికి ట్రై చేయండి.

Share
Admin

Recent Posts