చిట్కాలు

Headache : తలనొప్పిగా ఉందా.. ఈ గింజలతో వెంటనే తగ్గిపోతుంది..!

Headache : ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం అధిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. రోజూ ఏదో ఒక విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. దీంతోపాటు సరిగ్గా నీటిని కూడా తాగడం లేదు. ఫలితంగా డీహైడ్రేషన్‌ సమస్య వస్తోంది. అయితే ఇవన్నీ తలనొప్పికి కారణమవుతున్నాయి. తలనొప్పిని అలాగే వదిలేస్తే అది మైగ్రేన్‌కు దారి తీసే అవకాశాలు ఉంటాయి. అది తీవ్రమైన తలనొప్పిగా మారుతుంది. కనుక తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ కొందరు మెడికల్‌ షాపుకు వెళ్లి ఇంగ్లిష్‌ మందులను కొని తెచ్చి వేసుకుంటుంటారు. ఇవి అప్పటికప్పుడు తలనొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. కానీ వీటిని అధికంగా వాడితే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. ఇది మళ్లీ ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కనుక తలనొప్పి వస్తే ఇంగ్లిష్‌ మెడిసిన్‌ను వాడరాదు. సహజసిద్ధంగానే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

అయితే తలనొప్పిని తగ్గించుకునేందుకు ఓ సహజసిద్ధమైన చిట్కా అందుబాటులో ఉంది. అందుకు ఏం చేయాలంటే.. అర గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండాలి. అందులో సరిగ్గా ఆరు మిరియాలను పొడి చేసి వేసి బాగా కలపాలి. తరువాత ఆ నీటిని తాగేయాలి. తలనొప్పిగా ఉన్నప్పుడు ఇలా చేస్తే వెంటనే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

if you have headache then use these seeds

తలనొప్పిగా ఉన్నప్పుడు ఇలా తాగడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. మిరియాలు ఘాటుగా ఉంటాయి కనుక ఇవి రక్త సరఫరాను పెంచుతాయి. దీంతో తల భాగానికి రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఫలితంగా తలనొప్పి తగ్గుతుంది. కాబట్టి ఇకపై తలనొప్పి ఎప్పుడు వచ్చినా.. ఈ విధంగా చిట్కాను పాటించి చూడండి. వెంటనే ఉపశమనం లభిస్తుంది.

Admin

Recent Posts