Uric Acid : ప్రస్తుత కాలంలో మనల్ని వేధిస్తున్న అనేక అనారోగ్య సమస్యల్లో రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం కూడా ఒకటి. మాంసాహారం ఎక్కువగా తినే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తోంది. శరీరంలో ఉన్న ఈ యూరిక్ యాసిడ్ ను మూత్ర పిండాలు బయటకు పంపిస్తాయి. మూత్ర పిండాలు బయటకు పంపించే దాని కంటే కూడా ఎక్కువగా ఉత్పత్తి అయిన యూరిక్ యాసిడ్ శరీరంలో పేరుకుపోతుంది. ఈ యారిక్ యాసిడ్ కీళ్ల మధ్యలో పేరుకుంటే కీళ్ల నొప్పులు, వాపులు వస్తాయి. యూరిక్ యాసిడ్ నిల్వలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో ఆమ్ల శాతం కూడా పెరుగుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి వైద్యులు మనకు మందులను సూచిస్తుంటారు. కేవలం మందులతోనే కాకుండా సహజ సిద్ధంగా కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా కూడా చూసుకోవచ్చు.
సహజ సిద్ధంగా 8 నుండి 15 రోజుల్లోనే మనం ఈ సమస్య నుండి బయట పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా కేవలం నిమ్మరసం, తేనె కలిపిన నీటిని తాగుతూ ఉండడం వల్ల ఈ సమస్య నుండి మనం బయటపడవచ్చని వారు తెలియజేస్తున్నారు. ఈ విధంగా కేవలం నీటిని మాత్రమే తాగుతూ ఉండడం వల్ల శరీరంలోని యూరిక్ యాసిడ్ మొత్తం బయటకు పోతుంది. ఒక గ్లాస్ నీటిలో మూడు నుండి నాలుగు టీ స్పూన్ల తేనెను, ఒక నిమ్మకాయ సగం ముక్క రసాన్ని కలుపుకుని తాగుతూ ఉండాలి. ఈ విధంగా ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా రెండు గంటలకొకసారి తేనె నీటిని, అర గంటకొకసారి మంచి నీటిని తాగుతూ ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ త్వరగా బయటకు పోతుంది. ఈ విధంగా నాలుగు నుండి ఐదు రోజుల వరకు చేయాలి.
తేనె నీటిని తాగిన తరువాత మరలా మూడు రోజులు తేనె నీటికి బదులుగా పండ్ల రసాలను తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి మందులను వాడకుండానే యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలోకి వస్తాయని నొప్పులు, వాపులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గడంతోపాటు శరీరంలో ఉండే మలినాలు కూడా బయటకు పోతాయి. కాలేయం కూడా శుభ్రపడుతుంది. అలాగే భవిష్యత్తులో ఈ సమస్య రాకుండా ఉండాలంటే సాయంత్రం భోజనాన్ని 6 నుండి 7 గంటల లోపు తీసుకోవాలి.
అదే విధంగా సాయంత్రం భోజనంలో కేవలం పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఈ నియమాలను రోజూ పాటిస్తూనే మాంసాహారాన్ని తినడం మానేయాలి. తేనె కలిపిన నీటిని, పండ్ల రసాలను తాగడం వల్ల చాలా త్వరగా యూరిక్ యాసిడ్ స్థాయిలు సాధారణ స్థాయిలోకి వస్తాయి. ఆ తరువాత ఈ విధమైన ఆహార నియమాలను పాటించడం వల్ల భవిష్యత్తులో మరలా యూరిక్ యాసిడ్ సమస్య రాకుండా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.