Winter Health Tips : చలికాలంలో, అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చలికాలంలో, చాలామంది గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలానే ముక్కు కారడం, ఎలర్జీ, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్, దగ్గు వంటివి కూడా చాలా మందిలో, చలికాలంలో వస్తూ ఉంటాయి. కొంత మందికి, కొద్దిగా చల్లటి నీళ్లు తాగినా లేదంటే ఏదైనా చల్లటి పదార్థం తీసుకున్నా కూడా వెంటనే ఇబ్బంది కలుగుతుంది. గొంతు ఇన్ఫెక్షన్స్ రావడం, జలుబు, దగ్గు వంటివి కలుగుతూ ఉంటాయి. దీంతో చిన్న పొరపాటుకి 10 నుండి 15 రోజులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
గొంతు ఇన్ఫెక్షన్ వచ్చిందంటే, ఏదైనా తినాలన్నా తాగాలన్న కూడా కష్టంగా ఉంటుంది. గొంతులో గర గరలాడడం, గొంతు ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి వంటివి వస్తూ ఉంటాయి. వీటిని తగ్గించాలంటే, ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. వీటి కోసం మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. కేవలం కొన్ని పదార్థాలతోనే, ఈజీగా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.
ఒక గిన్నెలో కచ్చాపచ్చాగా దంచిన మూడు మిరియాలు వేసుకోండి. తిప్పతీగ కాడ చిన్న ముక్కని , ఒక స్పూన్ అల్లం తురుము లేదంటే కొద్దిగా శొంఠి పొడి వేసుకోండి. ఆరు తులసి ఆకులు, మూడు లవంగాలు, ఒక స్పూన్ వరకు సోంపు, గ్లాసున్నర నీళ్లు పోసి బాగా మరిగించండి.
మూడు నిమిషాలు మరిగిన తర్వాత, తిప్పతీగ ఆకు వేసి ఇంకో రెండు నిమిషాల పాటు మరిగించండి. తర్వాత ఆర్గానిక్ బెల్లం వేసి, ఒక నిమిషం పాటు మరిగించి, తర్వాత పొయ్యి కట్టేసి, చల్లారిన తర్వాత వడకట్టుకుని అర గ్లాసు డ్రింక్ ని ఉదయం, సాయంత్రం తీసుకుంటే చాలు. రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా గొంతు ఇన్ఫెక్షన్ ఈజీగా తగ్గుతుంది. వెంటనే సమస్య నుండి బయటపడొచ్చు.