Phlegm : మన రక్తంలో వివిధ రకాల రక్త కణాలు ఉంటాయి. వీటిలో ఇసినోఫిల్స్ కణాలు ఒకటి. మనకు జలుబు, దగ్గు చేసినప్పుడు ఊపిరితిత్తులల్లో కఫం, శ్లేష్మం పేరుకుపోయినప్పుడు వైరస్ ఇన్ ఫెక్షన్స్ కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జలుబు, దగ్గులకు కారణమైన వైరస్‌లను నశింపజేయడానికి రక్తంలో ఇసినోఫిల్స్ కణాల సంఖ్య పెరుగుతుంది. ఊపిరితిత్తులలో, గొంతులో కఫం, శ్లేష్మం పేరుకుపోవడం, జలుబు, దగ్గు, ఆయాసం వంటి సమస్యలు కొందరిలో జన్యుపరంగా కూడా సంక్రమిస్తూ ఉంటాయి. ఇలాంటి వారిలో తరచూ జలుబు, ముక్కు కారడం, ఆయాసం, పిల్లి కూతలు, ఆస్తమా వంటి సమస్యలను మనం చూడవచ్చు. వీరి రక్తంలో ఇసినోఫిల్స్ కణాల సంఖ్య ఎల్లప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఈ సమస్యను ఇసినోఫీలియా అంటారు.
రక్తంలో ఉండే ఈ ఇసినోఫిల్స్ కణాల సంఖ్యను మనం తగ్గించుకోవచ్చు. కఫాన్ని, శ్లేష్మాన్ని, దగ్గును పెంచే పంచదార కలిగిన పదార్థాలను, చల్లటి పదార్థాలను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి, రక్తంలో ఇసినోఫిల్స్ కణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రక్తంలో ఇసినోఫిల్స్ కణాల సంఖ్య ఎక్కువగా ఉండే వారు పంచదార కలిగిన పదార్థాలను, చల్లటి పదార్థాలను తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. బెల్లం, పంచదారకు బదులుగా తేనె, ఖర్జూర పండ్లను లేదా ఎండు ఖర్జూరాలను వాడుకోవాలి.
తేనెను వాడడం వల్ల జలుబు, దగ్గులకు కారణమయ్యే ఇన్‌పెక్షన్లను తగ్గిస్తుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరస్ లక్షణాలు అధికంగా ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్స్ తగ్గి తరచూ జలుబు, దగ్గుల బారిన పడకుండా ఉంటాం. తేనెను వాడడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇసినోఫిల్స్ కణాల సంఖ్య తగ్గుతుంది. ఇసినోఫిల్స్ కణాల సంఖ్య ఎక్కువగా ఉండే వారు చల్లటి నీటిని తాగకూడదు. వేడిగా లేదా గోరు వెచ్చగా ఉన్న నీటిని మాత్రమే తాగాలి. ఈ సమస్య ఉన్న వారు స్నానం చేయడానికి వేడి నీటినే ఎక్కువగా ఉపయోగించాలి.
ఇసినోఫీలియా సమస్యను తగ్గించడంలో స్టీమ్ బాత్ ఎంతగానో సహాయపడుతుంది. వారానికి రెండు సార్లు స్టీమ్ బాత్ చేయడం వల్ల ఇసినోఫిల్స్ కణాల సంఖ్య తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. మూడు లేదా నాలుగు రోజులు ఏమీ తినకుండా కేవలం తేనె, నిమ్మ రసం కలిపిన నీటిని మాత్రమే తాగాలి. ఇలా చేయడం వల్ల ఇన్ ఫెక్షన్స్ తగ్గి తరచూ జలుబు, దగ్గు, కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. దీంతో రక్తంలో ఇసినోఫిల్స్ కణాల సంఖ్య తగ్గుతుంది.