శరీరంలో వేడి అనేది సహజంగానే కొందరికి ఎక్కువగా ఉంటుంది. కారం, మసాలాలు, వేడి చేసే ఆహారాలను తింటే కొందరికి వేడి పెరుగుతుంది. కానీ కొందరికి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అయితే అలాంటి వారు కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే దాంతో శరీరంలోని వేడి ఇట్టే తగ్గించుకోవచ్చు. మరి.. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
* రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు కొబ్బరినీళ్లను ఒక గ్లాస్ మోతాదులో తాగుతుండాలి. దీంతో శరీరం రోజంతా చల్లగా ఉంటుంది. వేడి నుంచి తప్పించుకోవచ్చు.
* ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తో కలబంద గుజ్జును తీసుకుంటుండాలి. దీంతో వేడి తగ్గుతుంది.
* ఉదయాన్నే పరగడుపునే పుదీనా ఆకుల రసాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. దీని వల్ల కూడా శరీరం చల్లబడుతుంది.
* రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఒక గ్లాస్ పలుచని మజ్జిగలో కొద్దిగా కొత్తిమీరను కలిపి తాగాలి. దీంతో వేడి తగ్గుతుంది.
* విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలను, పండ్లను, కూరగాయలను తింటున్నా వేడిని తగ్గించుకోవచ్చు.
* ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు ఒక కప్పు కీరదోస ముక్కలను తినాలి. శరీరం చల్లగా అవుతుంది.
* ఉదయం పరగడుపున బీట్‌రూట్ జ్యూస్‌ను కప్పు మోతాదులో తాగుతుండాలి. వేడి నుంచి బయట పడవచ్చు.