Jackfruit Powder For Constipation : మనలో కొంత మందికి ఆహారాన్ని తక్కువ తీసుకునే అలవాటు ఉంటుంది. దాదాపు 10 శాతం మంది ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాగే కొందరు బరువు తగ్గాలని ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. కొందరికి కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారాన్ని తక్కువగా తీసుకుంటూ ఉంటారు. కొందరికి ఆకలి, ఆరుగుదల తక్కువగా ఉండడం వల్ల ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. ఇలా తక్కువగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల అలాగే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల మలబద్దకం సమస్య తలెత్తే అవకాశం ఉంది. మనకు రోజుకు 30 నుండి 35 గ్రాముల ఫైబర్ అవసరవమవుతుంది.
తగిన మోతాదులో ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల పొట్ట, ప్రేగులు శుభ్రమవుతాయి. అయితే ఇలా తక్కువ ఆహారాన్ని తీసుకోవడం వల్ల పొట్టలో వ్యర్థం ఎక్కువగా తయారవ్వదు. తక్కువగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల మలం తక్కువగా తయారవుతుంది. మలం తక్కువగా తయారవ్వడం వల్ల దానికి తగినంత ప్రెషర్ లభించక మలం బయటకు రాదు. దీంతో మలబద్దకం సమస్య తలెత్తుతుంది. ఇలా తక్కువ ఆహారాన్ని తీసుకునే వారికి, తక్కువ ఫైబర్ ఉండే ఆహారాలను తీసుకునే వారికి మలం తక్కువగా రావడంతో పాటు గట్టిగా వస్తుంది. అంతేకాకుండా మలవిసర్జన సమయంలో తీవ్ర అసౌకర్యానికి గురి కావాల్సి వస్తుంది. ఇలా తక్కువ ఆహారాన్ని తీసుకునే వారు, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తీసుకునే వారు మలబద్దకం సమస్య రాకుండా ఉండాలంటే రోజూ ఉదయం లీటర్నర నీటిని తాగాలి.
నీటిని ఎక్కువగా తాగడం వల్ల తగినంత ప్రెషర్ లభించి మలం ప్రేగుల్లో త్వరగా, సులభంగా కదులుతుంది. దీంతో మలం త్వరగా బయటకు వస్తుంది. ఇలా ఉదయం పరగుడుపున నీటిని తాగిన రెండు గంటల తరువాత మరలా లీటర్ నీటిని తాగాలి. ఇలా మరలా నీటిని తాగడం వల్ల ప్రేగులు పూర్తిగా శుభ్రపడతాయి. ఇలా నీటిని తాగడంతో పాటు పచ్చి పనస పండ్ల పొడిని వాడడం వల్ల కూడా మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది. ఈ పొడిని కూరల్లో వేసుకోవడం వల్ల కూడా మంచి పలితం ఉంటుంది. ఈ పసన పండ్ల పొడిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా తక్కువ ఆహారాన్ని తీసుకునే వారు, మలం గట్టిగా వచ్చే వారు ఈ చిట్కాలను పాటించడం వల్ల మలబద్దకం సమస్య దరి చేరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.