భారతీయులు ఎంతో పురాతన కాలంగా జీలకర్రను వాడుతున్నారు. వారి వంట ఇంటి పోపు దినుసుల్లో జీలకర్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీంతో మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీలకర్రను నిత్యం కింద తెలిపిన విధంగా తీసుకుంటే.. అధిక బరువు త్వరగా తగ్గుతుంది. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. మరి అందుకు ఏం చేయాలంటే…
* ఒక గ్లాస్ నీటిని పాత్రలో తీసుకుని అందులో టీస్పూన్ జీలకర్రను వేయాలి. ఆ నీటిని బాగా మరిగించి చల్లార్చాలి. అలా వచ్చిన నీటిని వడకట్టి తాగాలి. ఈ నీటిని రోజుకు 3 సార్లు తాగితే చాలు, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అధికంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
* 2 టేబుల్ స్పూన్ల జీలకర్రను తీసుకుని ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తీసి మరిగించి తాగాలి. అనంతరం నీటిలో నానిన ఆ జీలకర్రను తినేయాలి. దీంతో నెల రోజుల్లోనే పొట్ట కరిగిపోతుంది. అధిక బరువు తగ్గుతారు.
* జీలకర్రను 5 గ్రాముల మోతాదులో తీసుకుని పొడి చేయాలి. దాన్ని నిత్యం ఏదో ఒక సమయంలో ఒక కప్పు పెరుగులో కలుపుకుని తినాలి. దీంతో అధిక బరువు ఇట్టే తగ్గుతుంది.
* ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ తేనె, 3 గ్రాముల జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తాగాలి. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
* క్యారెట్లను బాగా ఉడకబెట్టాలి. వాటిపై నిమ్మ, వెల్లుల్లి రసం, జీలకర్ర పొడిలను చల్లాలి. అనంతరం ఆ క్యారెట్లను తినేయాలి. రోజూ రాత్రి డిన్నర్‌కు బదులుగా ఈ ఆహారం తింటే చాలు, కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారు.