Kapham : వాతావరణంలో మార్పులు, వాతావరణ కాలుష్యం కారణంగా మనలో చాలా మంది తుమ్ములు, జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్యలు చూడడానికి చిన్నగా ఉన్నప్పటికి వీటి వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. వాతావరణ కాలుష్యం కారణంగా కొందరకి ఉదయం లేవగానే వెంట వెంటనే తుమ్ముల వస్తూ ఉంటాయి. కొందరికి దగ్గు వస్తూ ఉంటుంది. గాలిలో ఉండే దుమ్ము, ధూళి కణాలు ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల అలాగే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా జరుగుతుంది. చాలా మంది ఈ సమస్య నుండి బయట పడడానికి మందులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయి. ఇటువంటి సమస్యలను మనం ఇంటి చిట్కాలతో కూడా నయం చేసుకోవచ్చు.
పొడి దగ్గు, తుమ్ములు, జలుబు వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాలను వాడడం వల్ల మంచి ఉపవమనం కలుగుతుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక అర టీ స్పూన్ ఆర్గానిక్ పసుపును తీసుకోవాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనెను వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా నాలుకపై వేసుకుని చప్పరిస్తూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల పసుపు, తేనెలో ఉండే ఔషధ గుణాలు గొంతులో అలాగే శ్వాస నాళంలో ఉండే వైరస్, బ్యాక్టీరియాలను నశింపజేస్తాయి. శ్వాసనాళం శుభ్రపడుతుంది. దగ్గుగా అనిపించినప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే మొదటిసారి తీసుకునే వారు దీనిని కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లేదంటే శరీరంలో వేడి చేసే అవకాశం ఉంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అలాగే దీనిని తీసుకున్న వెంటనే అనగా ఒక గంట వరకు నీటిని తీసుకోకూడదు. ఇప్పుడు మరో చిట్కా గురించి తెలుసుకుందాం. దీనిని తయారు చేసుకోవడానికి గానూ మనం మిరియాలను ఉపయోగించాల్సి ఉంటుంది. శ్వాస సంబంధిత సమస్యలను, ఛాతిలో కఫాన్ని తొలగించడంలో ఇవి చక్కగా పని చేస్తాయి. దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు రెండు మిరియాలను నోట్లో వేసుకుని కొద్ది కొద్దిగా నములుతూ రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల దగ్గు తగ్గుతుంది. ఇలా మూడు నుండి నాలుగు రోజుల పాటు తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల చాలా సులభంగా మందులు వాడే అవసరం లేకుండా మనం శ్వాస ససమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.