Kiwi Fruit : ప్రతి మనిషికి తగినంత నిద్ర పొందడం చాలా అవసరం. నిద్ర మనస్సు మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒక రాత్రి నిద్ర లేకపోవడం మరుసటి రోజు మీ ప్రణాళికలపై దృష్టి లేకుండా చేస్తుంది. కాలక్రమేణా నిద్ర తగ్గిపోవడం మీ ఉదయం మూడ్ కంటే ఎక్కువ గందరగోళానికి గురి చేస్తుంది. రోజూ నాణ్యమైన నిద్రను పొందడం వల్ల మీ బ్లడ్ షుగర్ నుండి మీ వ్యాయామాల వరకు అన్ని రకాల సమస్యలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఒక మనిషి కనీసం రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి వల్ల ప్రస్తుతం చాలామంది హాయిగా నిద్రపోలేకపోతున్నారు. నిద్ర సమయంలో అవకతవకల వల్ల ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నారు. మానసిక ఒత్తిడి, డయాబెటిస్, గుండెపోటు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే కివీ ఫ్రూట్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.
ప్రతి రోజూ ఒక కివీ ఫ్రూట్ తినడం వలన నిద్ర ప్రారంభమైన తర్వాత మేల్కొనే సమయం తగ్గిస్తుంది. నిద్ర సమయం మరియు నిద్ర సామర్థ్యం గణనీయంగా పెంచుతుంది. కివీ ఫ్రూట్ తినటం వలన నిద్ర భంగం ఉన్న పెద్దలలో నిద్ర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిద్రలేమితో బాధపడుతున్న వారికి కివీ మంచి ఔషధం. కివీలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. నిద్ర పోవటానికి గంట ముందు ఒక కివీ పండును తింటే హాయిగా నిద్రపడుతుంది.
కివీలో నిమ్మ, నారింజ కంటే అత్యధికంగా విటమిన్ సి ఉంటుంది. అందువలన కివీ తినడం వల్ల చర్మానికి కావలసిన విటమిన్ సి అంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ వ్యాధి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా గర్భిణీలు కివీ పండ్లను తినటం వలన బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతుంది. రోజుకు రెండు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను తగ్గిస్తాయి. కివీ పండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వలన మానసిక వ్యాధులను కూడా దరిచేరనివ్వదు.