Lemon And Coconut Oil For Dandruff : మనలో చాలా మందిని వేధిస్తున్న జుట్టు సంబంధిత సమస్యల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ సమస్య అందరిని వేధిస్తూ ఉంటుంది. వాతావరణ కాలుష్యం, తలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, తలలో చర్మం పొడిబారడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. చుండ్రు కారణంగా తలలో దురద, జుట్టు రాలడం, కోపం, చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది అనేక రకాల షాంపులను, మందులను కూడా వాడుతూ ఉంటారు. అయినప్పటికి ఈ సమస్య నుండి పూర్తి ఉపశమనం కలగదనే చెప్పవచ్చు.
చుండ్రు సమస్యతో బాధపడే వారు ఇప్పుడు చెప్పే చిట్కాను వాడడం వల్ల చక్కటి ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ చిట్కాను తయారు చేసుకుని వాడడం వల్ల చుండ్రు సమస్య నుండి శాశ్వతంగా బయటపడవచ్చు. ఈ చిట్కాను చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చుండ్రు సమస్యను నివారించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం నిమ్మరసాన్ని, కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికోసం ఒక గిన్నెలో 4 కప్పుల గోరు వెచ్చని నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో 2 స్పూన్ల నిమ్మరసం, 4 స్పూన్ల కొబ్బరి నూనె వేసి కలపాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని అంతా కలిసేలా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ రాత్రి పడుకునే ముందు తలకు బాగా పట్టించాలి. తరువాత తలకు వస్త్రాన్ని చుట్టుకుని పడుకోవాలి.దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది. ఇలా వారానికి ఒక్కసారి చేయడం వల్ల చుండ్రు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. చుండ్రు సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.