Liver Clean : 15 రోజుల‌కు ఒక‌సారి మీ లివ‌ర్‌ను ఇలా క్లీన్ చేసుకోండి.. ఎలాంటి రోగాలు రావు..!

Liver Clean : కిస్మిస్‌లు.. ఎండుద్రాక్ష‌.. ఎలా పిలిచినా స‌రే ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. మ‌న‌కు వివిధ ర‌కాల కిస్మిస్‌లు అందుబాటులో ఉన్నాయి. గోధుమ రంగులో ఉండేవి.. న‌లుపు రంగులో ఉండేవి. ఎక్కువ‌గా మ‌నం గోధుమ రంగులో ఉండే కిస్మిస్‌ల‌ను వాడుతుంటాం. వీటిని తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. కొంద‌రు వీటిని నేరుగా కూడా తింటుంటారు. అయితే కిస్మిస్‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. మ‌నం మ‌న శ‌రీరంలో పేరుకుపోయే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపేందుకు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోము. కానీ కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీళ్లు ఆ ప‌నిచేస్తాయి. అయితే వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీళ్లు మ‌న శ‌రీరాన్ని శుభ్రంగా చేస్తాయి. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతాయి. లివ‌ర్‌ను కూడా క్లీన్ చేస్తాయి. కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీళ్లు లివర్‌లో జరిగే రసాయనిక ప్రక్రియల‌ను వేగవంతం చేస్తాయి. దీంతో లివ‌ర్‌లోని మలినాలు త్వ‌ర‌గా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. ఈ నీళ్ళను నాలుగు రోజుల పాటు క్రమం తప్పకుండా తాగాలి. దీంతో జీర్ణశక్తి మెరుగు ప‌డుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. దీంతో జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు.

Liver Clean take dry grapes water daily for it
Liver Clean

ఇక కిస్మిస్‌ల‌ను నాన‌బెట్టిన నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే గుండె, కిడ్నీల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీని వ‌ల్ల సీజ‌నల్‌గా వ‌చ్చే వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఈ నీళ్లు ఎంతో శ‌క్తిని అందిస్తాయి. క‌నుక వీటిని తాగితే ఉత్సాహంగా ప‌నిచేస్తారు. యాక్టివ్‌గా ఉంటారు. బ‌ద్ద‌కం అన్న‌ది ఉండ‌దు. ఇక ఈ నీళ్ల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గుప్పెడు కిస్మిస్‌ల‌ను తీసుకుని 2 క‌ప్పుల నీళ్ల‌లో వేసి నీళ్లు 1 క‌ప్పు అయ్యే వ‌ర‌కు స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన అనంత‌రం స్ట‌వ్‌ను ఆఫ్ చేసి ఆ నీళ్ల‌ను రాత్రంతా అలాగే ఉంచాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఆ కిస్మిస్‌ల‌ను తిని ఆ నీళ్ల‌ను తాగాలి. ఇలా రోజూ చేయాలి. క్ర‌మం త‌ప్ప‌కుండా 4 రోజుల పాటు చేస్తే త‌ప్ప‌క ఫ‌లితం క‌నిపిస్తుంది. దీని వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. లివ‌ర్‌లోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. లివ‌ర్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

Share
Editor

Recent Posts