Long Pepper For Fat : అధిక బరువు.. నేటి తరుణంలో మనలో చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో ఇది ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. మారిన మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. అధిక బరువు వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. దీని వల్ల అనేక ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె పోటు, మోకాళ్ల నొప్పులు, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువవడం వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక ఈ సమస్య నుండి మనం త్వరగా బయటపడాలి. అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది అనేక రకాల మందులను వాడుతూ ఉంటారు.
రకరకాల డైటింగ్ పద్దతులను పాటిస్తూ ఉంటారు. అయినప్పటికి ఫలితం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. డైటింగ్ పద్దతులను పాటించడం వల్ల అలాగే మందులను వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మనం సహజంగా ఈ సమస్య నుండి బయటపడాలి. ఒక చక్కటి ఆయుర్వేద చిట్కాను వాడడం వల్ల మనం అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడం చాలా సులభం. అలాగే దీనిని వాడడం కూడా చాలా తేలిక. బరువును తగ్గించే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అలాగే దీనిని ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం 2 టీ స్పూన్ల పిప్పళ్లను, 2 టీ స్పూన్ల అవిసె గింజలను, 2 టీ స్పూన్ల సోంపు గింజలను, 2 టీ స్పూన్ వామును ఉపయోగించాల్సి ఉంటుంది.
పిప్పిళ్లు మనకు ఆయుర్వేద షాపుల్లో విరివిరిగా లభిస్తూ ఉంటాయి. ముందుగా ఒక కళాయిలో పిప్పిళ్లు, వాము, అవిసె గింజలు వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే సోంపు గింజలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి కలపాలి. తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని, అర టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. డయాబెటిస్ తో బాధపడే వారు తేనెను ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని రోజూ ఉదయం పరగడుపున తాగాలి.
ఇలా నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల అధిక బరువును చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది. బరువు తగ్గడంతో పాటు ఈ చిట్కాను వాడడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలన్నీ అందుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పానీయాన్ని వేసవికాలంలో రోజుకు ఒకసారి తాగాలి. వర్షాకాలం, చలికాలంలో రోజుకు రెండు సార్లు తాగాలి. ఈ విధంగా ఈ చిట్కాను పాటించడం వల్ల మనం చాలా సులభంగా ఎటువంటి దుష్ప్రభావాల లేకుండా బరువు తగ్గవచ్చు.