Curry Leaves Shampoo : కలబంద వలన, అనేక ఉపయోగాలు ఉంటాయి. కలబందని అందానికి కూడా మనం ఉపయోగించవచ్చు. జుట్టు ఆరోగ్యానికి కూడా, కలబంద బాగా ఉపయోగపడుతుంది. ఈరోజుల్లో చాలామంది, అందమైన కురులని పొందడం కోసం, మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ వాడుతున్నారు. కానీ, నిజానికి వాటిలో కెమికల్స్ ఉంటాయి. అటువంటి వాటిని ఉపయోగించడం వలన, సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి తప్ప ప్రయోజనాలు తక్కువ ఉంటాయి. ఇంట్లోనే మనం, సహజ సిద్ధమైన పదార్థాలతో షాంపూ ని తయారు చేసుకోవచ్చు.
వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ కలగవు. కలబంద మొక్క, ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఈజీగా మనం, కలబంద మొక్క గుజ్జు తీసుకోవచ్చు. అరకప్పు కలబంద గుజ్జు రెడీ చేసుకోండి. మిక్సీ జార్లో కలబంద గుజ్జు, శుభ్రంగా కడిగిన కరివేపాకు గుప్పెడు వేసుకోండి. మందార పువ్వులు రేకలని తీసేసి వేసుకోండి. నాలుగు మందర ఆకుల్ని ముక్కలు కింద వేసుకోండి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయని కూడా కట్ చేసి వేసుకోండి.
తర్వాత కొంచెం నీటిని పోసి, మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకుని వడకట్టేయండి. వడకట్టిన మిశ్రమంలో కొద్దిగా కుంకుడుకాయ రసంలో కలిపి, తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేసినట్లయితే, జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. చుండ్రు సమస్యకి కూడా చెక్ పెట్టచ్చు.
ఇంటి చిట్కాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. షాంపు ని కాకుండా కుంకుడుకాయల్ని వాడితే మంచిది. కలబంద, కరివేపాకు, మందారం ఇవన్నీ కూడా మనకి ఈజీగా దొరుకుతాయి. అసలు జుట్టు రాలదు. ఎర్ర రేఖ మందార పూలని వాడండి. కలబంద మొక్క కనుక లేకపోతే, మార్కెట్లో దొరికే జెల్ వాడొచ్చు. జుట్టుకి సంబంధించిన సమస్యలు రాగానే కంగారు పడకండి. ఎన్నో ఇంటి చిట్కాలు ఉన్నాయి. అద్భుతంగా పనిచేస్తాయి.