చిట్కాలు

పెస‌ర‌పిండితో నిగ‌నిగ‌లాడే చ‌ర్మం మీ సొంతం..

పెస‌లు తెలియ‌ని వారుండ‌రు. పెసళ్ళలో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి.పెస‌లు వంట‌ల‌కే కాదు చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. పెసలతో చ‌ర్మ సౌంద‌ర్యానికి, కేశ సౌంద‌ర్యానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. పురాతన కాలం నుండి ఇది బాగా సుపరిచితమైనది. మన వంటింట్లో ఉండే పెసరపిండితో చిన్నపాటి చిట్కాలు పాటించడం వల్ల చర్మం తాజాగా ఆరోగ్యంగా ఉంటుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేస్తే పోలా..

– పెసరపిండిలో కొద్దిగా పెరుగు, తేనె కలిపి పేస్టులా చేసి ముఖంపై అప్లై చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ చర్మంపై ఉన్న ముడతలు, మొటిమలను తొలగిస్తుంది.

– పెసరపిండిలో కాస్త ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకుని వాష్ చేసుకోవాలి. దీని వ‌ల్ల ముఖంపై జిడ్డు, పగలడం వంటివి తగ్గిపోతాయి.

– పెసరపిండిలో, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. వారానికి ఒకసారి ఇలా ప్యాక్ వేసుకుంటే చ‌ర్మంపై మురికి తొల‌గి కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

moong dal face pack it increases facial glow

– వేప నూనెను, పెసరపిండి కలిపి బాగా మిక్స్ చేసి త‌ల‌కు ప‌ట్టించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ చుండ్రుతో బాధపడేవారికి మంచి ఫలితం ఉంటుంది.

– కొందరికి మెడ, మోచేతులూ, మోకాళ్ల దగ్గర చర్మం నల్లగా మారుతుంది. పెసరపిండిలో కొద్దిగా నిమ్మరసం, రోజ్‌వాట‌ర్ మిక్స్ చేసి ఆ ప్రదేశాల్లో పూతలా వేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

– పెస‌ర‌పిండిలో ఎగ్‌వైట్‌, నిమ్మ‌ర‌సం మ‌రియు వాట‌ర్ యాడ్ చేసి త‌ల‌కు ప‌ట్టించి కొంత స‌మ‌యం త‌ర్వాత త‌ల‌స్నానం చేయాలి. దీని వ‌ల్ల జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది.

– పెసరపిండిలో, అలోవెర జెల్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే స్కిన్ ట్యానింగ్ సమస్యకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

Admin