మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో నల్ల మిరియాలు కూడా ఒకటి. నల్ల మిరియాలను ఎంతో కాలంగా మనం వంట్లలో వాడుతున్నాము. వీటిని నేరుగా లేదా పొడి రూపంలో వంటల్లో వాడుతూ ఉంటాము. నల్ల మిరియాలు ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడిని కూడా వాడవచ్చు. మిరియాలు వాడడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. అలాగే ఈ నల్ల మిరియాలు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా మిరియాలను విరివిగా వాడుతూ ఉంటారు. మిరియాలను వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని కూడా తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అసలు నల్ల మిరియాలను మనం ఆహారంలో భాగంగా ఎందుకు తీసుకోవాలి.. వీటిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల మిరియాల్లో మాంగనీస్, ఫైబర్, విటమిన్ కె, సి, ఎ, ఇ, బి, క్యాల్షియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. నల్ల మిరియాలను వాడడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో దోహదపడతాయి. నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో మిరియాలు చక్కగా పని చేస్తాయి. అదే విధంగా నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇవి యాంటీ డిస్పెరెంట్ గా పని చేస్తాయి. డిప్రెషన్ ను తగ్గించి మెదడు చురుకుగా, ఉత్తేజంగా పని చేసేలా చేయడంలో మిరియాలు అద్భుతంగా పని చేస్తాయి. ఇక మిరియాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అలాగే బరువు తగ్గడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో కూడా మిరియాలు సహాయపడతాయి. జలుబు, ఆస్థమా, సైనస్, దగ్గు వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో కూడా మిరియాలు ఉపయోగపడతాయి.
నల్ల మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ వంటి గుణాలు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా నల్ల మిరియాలను వాడడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటాము. ఈ విధంగా నల్ల మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఈ ప్రయోజనాలన్నింటిని పొందాలంటే మనం తప్పకుండా మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.