Skin Problems : మనల్ని వేధించే చర్మ సమస్యల్లో దురద కూడా ఒకటి. పురుగులు, కీటకాలు కుట్టడం వల్ల, వివిధ రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల, అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్ ల వల్ల ఈ దురద సమస్య తలెత్తుతుంది. దురద కారణంగా మనం ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. దురద సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమస్య మరింత తీవ్రరూపం దాల్చిక ముందే దీని నుండి బయటపడడం చాలా అవసరం. దురద సమ్య నుండి బయటపడడానికి మందులను, ఆయింట్ మెంట్ లను వాడుతూ ఉంటారు.
అయితే ఎటువంటి మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా కూడా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల మనం ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చులో దరదను తగ్గించుకోవచ్చు. దురద సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం వేపాకును, పసుపును ఉపయోగించాల్సి ఉంటుంది. వేపాకులో, పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ ను తగ్గించి దురదను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. దీని కోసం ముందుగా వేపాకును శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.
తరువాత ఇందులో కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని దురద ఉన్న చోట చర్మంపై రాయాలి. దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురద సమస్య తగ్గుతుంది. వేపాకు పేస్ట్ నుండి రసాన్ని తీసి కూడా మనం చర్మంపై రాసుకోవచ్చు. ఈ విధంగా వేపాకును, పసుపును కలిపి వాడడం వల్ల మనం చాలా సులభంగా దురద సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.