Nerve Weakness Kashayam : మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో నరాల బలహీనత సమస్య కూడా ఒకటి. ఈ సమస్య కారణంగా కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ సమస్య కారణంగా ఎవరి పని వారు చేసుకోలేకపోతుంటారు. నరాల బలహీనత, నొప్పుల కారణంగా తీవ్రమైన ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. నరాల బలహీనత సమస్య కారణంగా మన శరీరంలో ఇతర అవయవాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. నరాల బలహీనత సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. పోషకాహార లోపం, షుగర్, రక్తపోటు, నరాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం లేదా శరీరానికి తీవ్రమైన గాయాలు తగలడం వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. నరాల బలహీనత సమస్య తలెత్తినప్పుడు మనలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
ముఖ్యంగా మతిమరుపు, కళ్లు తిరగడం, కళ్లు సరిగ్గా కనబడనట్టు ఉండడం, శరీరంలో రక్తప్రసరణ సాఫీగా లేకపోవడం, చెవులు సరిగ్గా వినబడకపోవడం, అలాగే కాళ్లు మరియు చేతుల్లో స్పర్శ తెలియకపోవడం వంటి వాటిని ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు. నరాల బలహీనత కారణంగా శరీరంలో నొప్పులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నరాల బలహీనంగా ఉండే ప్రదేశాల్లో నొప్పులు ఎక్కువగా రావడం, రక్తపోటు పెరగడం, చెమటలు ఎక్కువగా పట్టడం వంటి వాటిని కూడా ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు. నరాల బలహీనత సమస్యతో బాధపడే వారు ఒక చక్కటి చిట్కాను పాటిస్తూ కొన్ని ఆహార నియమాలను పాటించడం వల్ల ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. నరాల బలహీనతను తగ్గించే ఆ చిట్కా ఏమిటి… ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి…అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఇందులో అర ఇంచు దాల్చిన చెక్కను వేయాలి. అలాగే ఒక నల్ల యాలక్కాయను, 3 లవంగాలను కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. తరువాత ఈ నీటిని మధ్యస్థ మంటపై అర గ్లాస్ కషాయం మిగిలే వరకు వేడి చేయాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో రుచికి తగినట్టు బెల్లాన్ని కలిపి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి. దీనిని తీసుకున్న అరగంట వరకు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు. అలా వీలు కానీ వారు బ్రేక్ ఫాస్ట్ చేసిన గంట తరువాత తీసుకోవాలి లేదా సాయంత్రం కడుపు ఖాళీగా ఉన్న సమయంలో తీసుకోవాలి. ఇలా రోజులో ఏదో ఒక సమయంలో మాత్రమే తీసుకోవాలి.
ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల నరాల బలహీనత సమస్య తగ్గుతుంది. నరాల్లో వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఎముకలు ధృడంగా, బలంగా తయారవుతాయి. పోషకాహార లోపం తలెత్తకుండా ఉంటుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలన్నీ తగ్గుతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే విటమిన్ బి 12, మెగ్నీషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. పాలు, పాల పదార్థాలు, గుడ్లు, చేపలు, పాలకూర వంటి వాటిని తీసుకోవాలి. అలాగే రాత్రంతా నానబెట్టిన వేరుశనగలను తీసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం, యోగా వంటి వాటిని చేస్తూ ఉండాలి. అలాగే నొప్పులు, వాపులు ఉన్న చోట నూనెతో మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఈ చిట్కాను పాటిస్తూ ఆహార నియమాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా నరాల బలహీనత సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.