Nuli Purugulu : పిల్లల్లో మనకు ఎక్కువగా కనిపించే సమస్యల్లో నులి పురుగుల సమస్య కూడా ఒకటి. ఇవి పేగుల నుండి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. ఇవి కొన్ని నెలల్లోనే గుడ్లు, లార్వాలుగా అభివృద్ది చెందుతాయి. ఈ సమస్య కారణంగా రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, నీరసం, కడుపునొప్పి, వికారం, విరేచనాలు, బరువు తగ్గడం, మలద్వారం వద్ద దురద పెట్టడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నులి పురుగుల సమస్యను మనం పిల్లలతోపాటు పెద్దవారిలో కూడా చూడవచ్చు. ముఖ్యంగా అపరిశుభ్రత కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య నుండి సాద్యమైనంత త్వరగా బయటపడాలని లేదంటే అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఇంటి చిట్కాలను పాటిస్తూ కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా ఈ సమస్య నుండి మనం బయటపడవచ్చు. సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించి కడుపులో నులి పురుగుల సమస్య నుండి ఎలా విముక్తి పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. నులి పురుగుల సమస్యతో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల ఒక్కరోజులోనే మనకు ఫలితం కనబడుతుంది. నులిపురుగులను సమర్థవంతంగా నాశనం చేయడంలో మనకు వాము ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా ఒక జార్ లో కొద్దిగా వామును తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని మరో గిన్నెలో వేసుకోవాలి. తరువాత ఈ పొడిలో రెండు చిటకెల మోతాదులో నల్ల ఉప్పును వేసి రెండూ కలిసేలా బాగా కలపాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని పెద్దలు ఉదయం పరగడుపున అర టీ స్పూన్ మోతాదులో అలాగే రాత్రి పడుకునే ముందు అర టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. అదే పిల్లలకు అయితే ఈ మిశ్రమాన్ని ఉదయం పూట పావు టీ స్పూన్ అలాగే రాత్రి పడుకునే ముందు పావు టీ స్పూన్ మోతాదులో ఇవ్వాలి. ఈ విధంగా ఈ మిశ్రమాన్ని వాడడం వల్ల చిన్న పిల్లల్లో ఒక్క రోజులోనే మనం తేడాను గమనించవచ్చు. సమస్య మరీ తీవ్రంగా ఉండే వారు ఈ చిట్కాను వారం రోజుల పాటు క్రమం తప్పకుండా వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వాము పొడి మిశ్రమాన్ని వాడడం వల్ల నులిపురుగుల సమస్య తగ్గడంతోపాటు గ్యాస్, మలబద్దకం, అజీర్తి వంటి ఇతర జీర్ణసంబంధిత సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి.