చెమట అనేది సాధారణంగా ప్రతి ఒక్కరికీ వస్తూనే ఉంటుంది. వేడి ప్రదేశాల్లో ఉన్నప్పుడు, వేసవి కాలంలో, శరీరంలో వేడిని పెంచే పదార్థాలను తిన్నప్పుడు.. ఇలా అనేక సందర్భాల్లో చెమట పడుతుంది. అయితే కొందరికి ఓ వైపు ఫ్యాన్ కింద ఉన్నా, ఏసీ నడుస్తున్నా సరే.. విపరీతంగా చెమట వస్తుంటుంది. దీంతో ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అలా చెమట సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారు కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
* శరీరంలో చెమట ఎక్కువగా వచ్చే భాగాలపై పసుపు రుద్ది అనంతరం స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చెమట సమస్య చాలా వరకు తగ్గుతుంది.
* చెమట పట్టే చోట్లలో నిమ్మకాయ ముక్కను రుద్దాలి. తరువాత స్నానం చేయాలి. దీంతో చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది.
* చెమట పట్టే భాగాల్లో టమాటా జ్యూస్‌ను రుద్ది తరువాత స్నానం చేయాలి. దీని వల్ల కూడా చెమట సమస్య నుంచి బయట పడవచ్చు.
* స్నానం చేసే నీటిలో పుదీనా ఆకులను వేసి కొద్ది సేపు అయ్యాక స్నానం చేయాలి. దీంతో చర్మం తాజాగా మారుతుంది. చెమట సమస్య నుంచి బయట పడవచ్చు.
* 1 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంలను తీసుకుని బాగా కలిపి చెమట పట్టే చోట రాయాలి. తరువాత స్నానం చేయాలి. దీంతో చెమట రాకుండా చూసుకోవచ్చు.
* స్నానం చేసే నీటిలో 1 టేబుల్ స్పూన్ తేనెను కలిపి స్నానం చేయడం వల్ల చెమట రాకుండా చూసుకోవచ్చు.
* స్నానం చేసే నీటిలో రోజ్ వాటర్ పోసి స్నానం చేసినా చెమట ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చూసుకోవచ్చు.
* మసాలాలు, కారం, ఉప్పు, నూనె పదార్థాలను అధికంగా తిన్నా కొందరిలో చెమట అధిక పోస్తుంది. కనుక అలాంటి పదార్థాలకు దూరంగా ఉంటే.. అధిక చెమట సమస్య నుంచి బయట పడవచ్చు.