స్థూలకాయం, మద్యం ఎక్కువగా సేవించడం, మాంసాహారాలను అధికంగా తీసుకోవడం, దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు వంటి అనేక కారణాల వల్ల మనలో అధిక శాతం మందికి అప్పుడప్పుడు మలబద్దకం సమస్య వస్తుంటుంది. దీంతో టాయిలెట్లలో గంటల తరబడి గడపాల్సి వస్తుంది. తీవ్రంగా కాలయాపన జరగడమే కాదు, వేదన కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాను పాటిస్తే కేవలం 10 సెకన్లలోనే సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం ఉండదు. అందుకు ఏం చేయాలంటే..
బొడ్డు కింద అడ్డంగా 3 వేళ్లను పెట్టి కొలవాలి. చివరి వేలి కింద బొడ్డుకు సూటిగా వచ్చే పాయింట్‌పై కొంత ఒత్తిడి కలిగించాలి. సుతారంగా ఒత్తిడి కలిగిస్తూ మర్దనా చేసినట్లు చేయాలి. దీంతో కేవలం 10 సెకన్లలో సుఖ విరేచనం అవుతుంది. పెద్ద పేగుల్లో ఉండే వ్యర్థం అంతా దెబ్బకు బయటకు వస్తుంది. మలబద్దకం సమస్య ఉండదు.
పైన తెలిపిన పాయింట్‌ను సీ ఆఫ్ ఎనర్జీ పాయింట్ అని పిలుస్తారు. ఆక్యుప్రెషర్ వైద్యంలో ఇది ప్రముఖంగా చెప్పబడింది. మలబద్దకం సమస్య ఉన్నవారు దీన్ని ట్రై చేయవచ్చు. అయితే 10 సెకన్లలో విరేచనం అవకపోతే 2 నిమిషాలు ఆగి మళ్లీ ప్రయత్నించాలి. కొన్నిసార్లు ఎక్కువ సమయం తీసుకుంటుంది. కొందరికి త్వరగా సమస్య పరిష్కారమవుతుంది.