Black Pepper : మిరియాల‌ను ఇలా తీసుకోండి.. దెబ్బ‌కు పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Black Pepper : భారతీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే మిరియాల‌ను వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి మ‌న‌కు వంట ఇంటి దినుసుగా ఉంది. వాస్త‌వానికి ఆయుర్వేద ప్ర‌కారం మిరియాల‌తో మ‌న‌కు అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీన్ని స‌రిగ్గా తీసుకోవాలే కానీ అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా పొట్ట ద‌గ్గ‌ర ఉండే కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది. మిరియాల‌లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

take Black Pepper in this way to reduce belly fat
Black Pepper

మిరియాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న క‌ఫం మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది. దీంతో ద‌గ్గు, జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే అధిక బ‌రువు త‌గ్గుతారు. మిరియాల‌లో పైప‌రైన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది మెట‌బాలిజంను పెంచుతుంది. కొవ్వును క‌రిగిస్తుంది. క‌నుక పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు సుల‌భంగా క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

ఇక మిరియాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు కొత్త‌గా ఏర్ప‌డ‌దు. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాక అలాగే ఉంటుంది. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉండి.. ఎల్ల‌ప్పుడూ స‌న్న‌గా క‌నిపిస్తారు. మిరియాల‌ను తీసుకోవడం వ‌ల్ల ఇలా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వీటి వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

అయితే మిరియాల ద్వారా ప్ర‌యోజాలను పొందాలంటే వాటిని ఎలా తీసుకోవాలి ? అనే చాలా మంది సందేహిస్తుంటారు. దీనికి నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారంటే.. మిరియాల‌ను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీటిని ఉదయం, సాయంత్రం ఒక క‌ప్పు మోతాదులో తాగ‌వ‌చ్చు. అందులో రుచి కోసం కాస్త తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి కూడా తాగ‌వ‌చ్చు.

ఇక మ‌ధ్యాహ్నం భోజ‌నం చివ‌ర్లో కాస్త పెరుగులో మిరియాల పొడిని కలిపి తీసుకోవ‌చ్చు. లేదా పూట‌కు ఒక టీస్పూన్ తేనె, అర‌టీస్పూన్ మిరియాల పొడిని క‌లిపి తీసుకోవ‌చ్చు. లేదా రాత్రి పాల‌లో కాస్త మిరియాల పొడి క‌లిపి తాగ‌వ‌చ్చు. లేదా రాత్రి ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లోనూ టీస్పూన్ మిరియాల పొడిని క‌లిపి తీసుకోవ‌చ్చు. ఇలా ఏ రూపంలో మిరియాల‌ను తీసుకున్నా.. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి.

Share
Admin

Recent Posts