Chia Seeds For Constipation : ప్రస్తుత తరుణంలో చాలా మంది మలబద్దకం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఉదయం టాయిలెట్‌లో విరేచనం సాఫీగా జరగక గంటల తరబడి అలాగే ఉంటున్నారు. దీంతో వారు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మలబద్దకం అనేది అనేక రకాల కారణాల వల్ల వస్తుంది. కానీ వస్తే మాత్రం జాగ్రత్త వహించాల్సిందే. లేదంటే జీర్ణవ్యవస్థ పనితీరుకు ఆటంకం కలుగుతుంది. ఇది ఇతర వ్యాధులను తెచ్చి పెడుతుంది. కనుక మలబద్దకం సమస్య నుంచి వీలైనంత త్వరగా బయట పడాలి. ఇందుకు గాను మనకు చియా సీడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మలబద్దకం అనేది ఉండదు. వీటిని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చియా సీడ్స్ చూసేందుకు అచ్చం సబ్జా గింజల మాదిరిగానే ఉంటాయి. చియా సీడ్స్ కూడా సబ్జా గింజల్లాగే నీళ్లలో వేయగానే తెల్లగా మారి ఉబ్బుతాయి. ఇలా చియా సీడ్స్‌ను నీటిలో నానబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ చియా సీడ్స్‌ను వేసి సుమారుగా 2 గంటల పాటు నానబెట్టాలి. దీంతో అవి తెల్లగా మారి ఉబ్బుతాయి. అనంతరం వాటిని అలాగే నీళ్లతో సహా తింటూ తాగేయాలి. ఇలా చియా సీడ్స్‌ను నీళ్లలో నానబెట్టి రోజుకు కనీసం రెండు సార్లు తాగాలి. దీంతో మలబద్దకం సమస్య అనేది ఉండదు. మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే విరేచనం అంటూ పరుగెడతారు. దీంతో దెబ్బకు పొట్టలో ఉన్న మలం అంతా బయటకు తన్నుకు వస్తుంది. ఇలా చియా సీడ్స్ మలబద్దకాన్ని తగ్గించేందుకు ఎంతానో ఉపయోగపడతాయి. కనుక మలబద్దకంతోపాటు ఇతర జీర్ణ సమస్యలు ఉన్నా కూడా వీటిని రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక చియా సీడ్స్‌ను తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇవి చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటాయి. కనుక వేసవిలో వీటిని తీసుకుంటే మనకు ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని వేడి మొత్తం తగ్గుతుంది. వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. బయటకు వెళ్లే ముందు వీటిని తింటే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా తప్పించుకోవచ్చు. ఇక వీటిని తీసుకోవడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది కనుక షుగర్ లెవల్స్‌ను నియంత్రించుకోవచ్చు. అలాగే బరువు కూడా తగ్గవచ్చు. ఇలా అనేక ఉపయోగాలు ఉన్నాయి కనుక చియా సీడ్స్‌ను రోజూ తీసుకోవాలి. కాలాలతో సంబంధం లేకుండా వీటిని ఎప్పుడైనా సరే తీసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.