భారతీయులందరి వంట ఇంటి పోపు దినుసుల్లో ధనియాలు ఒకటి. వీటిని కొందరు ఇష్టపడరు. కానీ వీటిల్లో అనేక ఔషధ విలువలు దాగి ఉంటాయి. ధనియాలతో మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే ధనియాల నీళ్లను తాగడం వల్ల జ్వరం నుంచి బయట పడవచ్చు. ధనియాలు జ్వరాన్ని వేగంగా తగ్గించడంలో సహాయ పడతాయి.
సాధారణంగా కొందరి శరీరం ఎప్పుడూ సహజంగానే వేడిగా ఉంటుంది. ఇక సీజన్లు మారే సమయంలో జ్వరం కారణంగా శరీరం వేడెక్కుతుంది. దీంతోపాటు ఒళ్లంతా మంటలు వచ్చినట్లు అనిపిస్తుంది. దాహం ఎక్కువగా అవుతుంది. అయితే ఈ సమస్యలను ధనియాలతో తగ్గించుకోవచ్చు.
ఇలా తయారు చేయాలి
10 గ్రాముల ధనియాలను తీసుకుని పొడి చేయాలి. 60 ఎంఎల్ నీటిలో ఆ పొడిని కలపాలి. దాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే వడకట్టి అందులో కొద్దిగా చక్కెరను కలిపి ఆ మిశ్రమాన్ని పరగడుపునే తాగేయాలి.
ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల శరీరం చల్లగా మారుతుంది. తరచూ శరీరం వేడిగా ఉందని చెప్పేవారు ఈ మిశ్రమాన్ని రోజూ తాగితే శరీరం చల్లగా అవుతుంది. పైన తెలిపిన ధనియాల మిశ్రమం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. జ్వరం తగ్గుతుంది. శరీరం మంటలుగా అనిపిస్తుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే అతి దాహం సమస్య తగ్గుతుంది. శరీరంలోని ప్రతి కణజాలం శుభ్రమవుతుంది. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది. ఈ మిశ్రమాన్నే ధన్యక హిమ అని ఆయుర్వేద ప్రకారం పిలుస్తారు. దీని గురించి శరంగ్ధర సంహిత అనే గ్రంథంలో వివరించారు. అందువల్ల ఈ మిశ్రమాన్ని తాగితే శరీరాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచుకోవచ్చు.
ఈ మిశ్రమం వల్ల జీర్ణవ్యవస్థలో మంటలు కూడా తగ్గుతాయి. పరగడుపునే ఈ మిశ్రమాన్ని రోజూ 50 ఎంఎల్ వరకు తాగవచ్చు. అందులో అర టీస్పూన్ చక్కెర కలిపి తాగాలి. ఇలా 6-8 వారాల పాటు తీసుకోవాలి. దీంతో చక్కని ఫలితం ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365