Body Pains : ఫైబ్రో మైయాల్జియా.. ఈ సమస్యతో బాధపడే వారు కూడా మనలో చాలా మంది ఉండే ఉంటారు. కొందరిలో రెండు నుండి మూడు నెలల పాటు శరీరమంతా నొప్పులు ఉంటాయి. కొందరిలో శరీర పై భాగంలో లేదా శరీర కింది భాగంలో మత్రమే నొప్పులు మాత్రమే ఉంటాయి. ఈ స్థితినే ఫైబ్రో మైయాల్జియా అంటారు. యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీద ఎక్కువ నెలలు పడుకున్న వారికి, సర్జరీలై బెడ్ రెస్ట్ ఎక్కువగా తీసుకున్న వారికి అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్ ల కారణంగా కూడా ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. వీటితో పాటు దీర్ఘకాలికంగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారిలో కూడా ఈ ఫైబ్రోమైయాల్జియా సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ సమస్య దీర్ఘకాలం పాటు ఉండడం వల్ల వారిలో నొప్పులు అధికమవ్వడంతో పాటు నీరసం, అలసట, నిద్రలేమి, ఏ పని మీద కూడా దృష్టి పెట్టలేకపోవడం, నెగెటివ్ ఆలోచనలు ఎక్కువవడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం ఇతర సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఈ సమస్య నుండి నిర్లక్ష్యం చేసే కొద్ది కండరాల నొప్పులు కూడా ఎక్కువవుతాయి. ఈ సమస్య నుండి బయటపడానికి చాలా మంది తాత్కాలిక ఉపశమనం కోసం మందులను వాడుతూ ఉంటారు. మందులతో పనిలేకుండా ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని జర్మనీ దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.
ఈ పద్దతిలో రోజుకు రెండు సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఉదయం 10 గంటలకు ఒకసారి,సాయంత్రం 5 గంటలకొకసారి మాత్రమే భోజనాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల నరాల్లో వచ్చే ఇన్ ప్లామేషన్ తగ్గి నొప్పులు తగ్గుతున్నాయని నిపుణులు వెల్లడించారు. ఉదయం పూట నీళ్లు తాగుతూ ఉండాలి. తరువాత 10 గంటలకు ఫ్రూట్ జ్యూస్ ను లేదా వెజిటేబుల్ జ్యూస్ ను తాగాలి. 11 గంటలకు ఒకటి లేదా రెండు పుల్కాలను ఉప్పు, నూనె లేని కూరలతో కలిపి తినాలి. ఇక మధ్యాహ్నం అంతా నీళ్లు తాగుతూ ఉండాలి. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ ను తాగాలి. ఇక 5 గంటలకు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చియా విత్తనాలను, వాల్ నట్స్ ను తీసుకోవాలి.
అలాగే విటమిన్ ఇ ఎక్కువగా ఉండే పొద్దు తిరుగుడు పప్పు, బాదం పప్పు, గుమ్మడి పప్పు వంటి వాటిని తీసుకుని ఏదైనా రెండు లేదా మూడు రకాల ఫ్రూట్స్ ను తినాలి. రోజూ ఈవిధంగా ఆహారాన్ని తీసుకుంటూ తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండడం వల్ల ఫైబ్రోమైయాల్జియా నెల నుండి నెలన్నర లోపే తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది మందులు వాడినప్పటికి ఈ సమస్య నుండి బయటపడలేకపోతుంటారు. అలాంటి వారు ఈ ఇంటర్ మీడియేట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఇన్ ప్లామేషన్ తగ్గి నొప్పులు త్వరగా తగ్గుతాయని వారు చెబుతున్నారు.