Fat : ప్రతి రోజూ దీన్ని రెండు స్పూన్లు తీసుకోండి.. శరీరంలో ఉన్న‌ కొవ్వు కరిగిపోతుంది..

Fat : ప్రస్తుత తరుణంలో చాలా మందిని అధిక బరువు సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలా మంది అధిక బరువుతో సతమతం అవుతున్నారు. ప్రస్తుత జీవనవిధానం వల్ల చాలా మంది అధిక బరువు సమస్యతో అవస్థలు పడుతున్నారు. అయితే అధిక బరువును తగ్గించేందుకు కింద తెలిపిన ఒక్క చిట్కాను పాటించాలి. దీంతో శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.

take this daily two times one teaspoon each to reduce Fat

ప్రస్తుత తరుణంలో చాలా మంది రిఫైన్డ్‌ ఆయిల్స్‌ ను వంటలకు ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల బరువు పెరగడంతోపాటు డయాబెటిస్‌ వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. కనుక రిఫైన్‌ చేయబడని నూనెలను ఉపయోగించాలి. వాటిల్లో ఆలివ్‌ ఆయిల్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మనకు మార్కెట్‌లో ఇది వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌ రూపంలో లభిస్తుంది. అంటే రిఫైన్‌ చేయబడని నూనె అని అర్థం. దీన్ని కొనుగోలు చేసి వాడితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

ఆలివ్‌ ఆయిల్‌ను పలు యూరప్‌ దేశాల వాసులు విరివిగా ఉపయోగిస్తుంటారు. అందుకనే అక్కడ కొన్ని దేశాల వారు నాజూగ్గా ఉంటారు. ఆలివ్‌ ఆయిల్‌ను మనం కూడా రోజూ ఉపయోగిస్తుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు. వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌ను రోజూ ఒక టీస్పూన్‌ మోతాదులో వాడితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అధిక బరువును తగ్గించుకోవడానికి ఇది బాగా పనిచేస్తుంది.

వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌తో బరువు తగ్గడం తేలికే అని చెప్పవచ్చు. వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌ను ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని అందులో చిటికెడు హిమాలయన్‌ సాల్ట్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున, రాత్రి నిద్రకు 30 నిమిషాల ముందు తీసుకోవాలి. దీన్ని ఉదయం తీసుకున్నప్పుడు గంట పాటు ఏమీ తీసుకోకూడదు. ఇలా 30 రోజుల పాటు రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక బరువు తగ్గుతారు. కొవ్వు కరుగుతుంది.

వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌లో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి కొవ్వున కరిగిస్తాయి. జీర్ణాశయాన్ని శుభ్రం చేస్తాయి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మలబద్దకం నుంచి బయట పడవచ్చు. అలాగే రక్తం శుద్ధి అవుతుంది. పెద్ద పేగు ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ కాంతి పెరుగుతుంది. మచ్చలు, మొటిమలు పోతాయి.
వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌ ఖరీదు ఎక్కువ. కానీ స్థోమత ఉన్నవారు దీన్ని వంటల్లోనూ ఉపయోగించవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

Admin

Recent Posts