అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పసుపు ఇందుకు కొంత వరకు ఉత్తమంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. పొట్ట దగ్గరి కొవ్వు, నడుం దగ్గరి కొవ్వులను కరిగించేందుకు కూడా పసుపు పనికొస్తుంది. పసుపును తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
క్లోమగ్రంథి, కండరాల వాపులను తగ్గించేందుకు పసుపు ఉపయోగపడుతుంది. అలాగే పసుపును తీసుకోవడం వల్ల హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయని, షుగర్ అదుపులో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్లే వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా వాపు వల్ల వచ్చే స్థూలకాయం తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు, బీపీ నియంత్రణలో ఉంటాయి. పసుపు వల్ల శరీరంలో కొవ్వు కణాలు ఏర్పడకుండా ఉంటాయి.
1. నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ పసుపు కలుపుకుని రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు తాగాలి. దీని వల్ల బరువు తగ్గుతారు. శరీర మెటబాలిజం పెరుగుతుంది. కొత్తగా కొవ్వు చేరకుండా ఉంటుంది.
2. ఒక కప్పు నీటిలో కొద్దిగా పసుపు వేసి మరిగించాలి. అనంతరం అందులో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలుపుకుని తాగాలి. ఇలా రోజూ ఉదయాన్నే చేయడం వల్ల ఫలితం ఉంటుంది.
3. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తేనె, పసుపులను కలిపి తాగడం వల్ల కూడా అధిక బరువును, పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించుకోవచ్చు. పరగడుపున తాగితే ఫలితం ఉంటుంది.