Knee Pain : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే ఈ కీళ్ల నొప్పలు ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరిలోనూ కనిపిస్తున్నాయి. ఈ నొప్పులు రావడానికి ప్రధాన కారణం శరీరంలో కాల్షియం తక్కువగా ఉండడమే అని చెప్పవచ్చు. చాలా మంది రుచికరమైన ఆహారాన్ని తినడానికి అలవాటు పడి పోషకాహారాన్ని తినడం మానేశారు. పోషకాహార లోపం వల్లే మనం అనేక రోగాల బారిన పడుతున్నామని నిపుణులు చెబుతున్నారు.
ఈ కీళ్ల నొప్పుల నుండి బయట పడడానికి మనం రకరకాల ఆయింట్ మెంట్లను, తైలాలను నొప్పి ఉన్న చోట రాస్తూ ఉంటాం. అలాగే రకరకాల మందులను కూడా మింగుతూ ఉంటాం. వీటిని ఉపయోగించడం వల్ల తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే దొరుకుతుంది. ఆయుర్వేదం ద్వారా మనం నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదం ద్వారా శాశ్వతంగా ఈ కీళ్ల నొప్పులను, మోకాళ్ల నొప్పులను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కీళ్ల నొప్పుల నుండి బయటపడడానికి మనం మన ఇంటి పరిసరాలలో ఉండే కుక్కవాయింట మొక్కను ఉపయోగించాల్సి ఉంటుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ మొక్క ఎంతగానో సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కుక్క వాయింట మొక్కలు వర్షాకాలంలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ మొక్క ఆకులను సేకరించి వాటికి ఆముదం నూనెను కలిపి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టుకట్టాలి. ఈ విధంగా చేస్తూ ఉండడం వల్ల క్రమంగా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. దీన్ని తరచూ వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి. ఎలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి.