తేనెను నిత్యం అనేక మంది పలు రకాలుగా తీసుకుంటుంటారు. దీన్ని పాలలో కలిపి కొందరు తాగుతారు. కొందరు సలాడ్స్ వంటి వాటిలో వేసి తింటారు. అయితే తేనె వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. దీనికి ఆయుర్వేదంలో ముఖ్య పాత్ర ఉంది. దీని వల్ల పలు అనారోగ్య సమస్యలను మనం నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* జాజికాయ పొడి పావు టీస్పూన్, 1 టేబుల్ స్పూన్ తేనెను నిత్యం రాత్రి పడుకునే ముందు తీసుకుంటే నిద్ర సరిగ్గా పడుతుంది. నిద్ర లేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
* 1 కప్పు గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనెలను కలిపి తీసుకుంటే గొంతు సమస్యలు తగ్గుతాయి. దగ్గు తక్కువవుతుంది.
* అధిక బరువు తగ్గాలనుకునేవారు 1 కప్పు గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ దాల్చినచెక్క పొడి, 1 టేబుల్ స్పూన్ తేనెలను కలిపి నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
* టీ డికాషన్ లో 1 టేబుల్ స్పూన్ తేనెను కలిపి నిత్యం ఉదయాన్నే తీసుకుంటే శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
* ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ తేనెను కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తీసుకుంటే మలబద్దకం సమస్య ఉండదు.
* 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి నొప్పి ఉన్న దంతంపై రాస్తుండాలి. దీంతో దంతాల నొప్పి తగ్గుతుంది.
* దగ్గు సమస్యకు 1 టీస్పూన్ అల్లం రసం, 1 టేబుల్ స్పూన్ తేనెలను కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
* ఒక కప్పు గోరు వెచ్చన నీటిలో 1 టీస్పూన్ అల్లం రసం, ఒక టేబుల్ స్పూన్ తేనెలను కలిపి తాగితే సైనస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
* ఒక కప్పు గోరు వెచ్చని పాలలో 1 టీస్పూన్ తేనెను కలిపి నిత్యం ఉదయం, సాయంత్రం తాగితే జలుబు తగ్గుతుంది.
* 1 టీస్పూన్ తేనె, కొద్దిగా టీ ట్రీ ఆయిల్‌ను తీసుకుని బాగా కలిపి మొటిమలపై రాయాలి. మొటిమలు త్వరగా తగ్గుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365