చిట్కాలు

వేప ఆకుల‌తో ఇలా చేస్తే అల్స‌ర్ అస‌లే ఉండ‌దు..!

ఇంటిముందు వేపచెట్టు ఉంటే మంచిదని చెబుతుంటారు. చల్లటి గాలితో పాటు వేప నుండి వచ్చే లాభాలు చాలానే ఉన్నాయి. ఆ లాభాలేంటో తెలుసుకుని, వేపవల్ల కలిగే లాభాలని పొందితే బాగుంటుంది. చర్మ సమస్యలకు గానీ జీర్ణ సమస్యలకు గానీ, అల్సర్ వంటి ఇబ్బందులకు కూడా వేప బాగా పనిచేస్తుంది. వేపలో ఏ,బీ, సీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటివల్ల రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. డయాబెటిస్ రాకుండా ఉండడానికి వేపని ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిది.

అల్సర్.. చాలా మందిని వేధించే సమస్య. ఈ సమస్య నుండి బయటపడడానికి వేప ఆకులని నీటిలో బాగా ఉడకబెట్టాలి. తర్వాత ఆ నీటిని వడపోసి, దాన్ని రోజూ పొద్దున్నపూట తాగితే అల్సర్ నుండి ఉపశమనం కలుగుతుంది. అస్తమాను నయం చేసే అసలైన మందు వేప. రోజూ ఉదయం పూట వేప ఆకులను నములుతూ ఉంటే కొన్ని రోజులకి అస్తమా కంట్రోల్ లోకి వస్తుంది.

use neem leaves in this way to get rid of stomach ulcer

వేప వల్ల చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. మొటిమలను తగ్గించడంతో పాటు అనేక చర్మ సమస్యలను దూరం చేస్తుంది. మొటిమలు తగ్గడానికి వేపని రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి మర్దన చేసుకుంటే తొందర్లోనే మొటిమలు పూర్తిగా నయం అవుతాయి. ఇంకా నిగనిగలాడే చర్మానికి వేపనూనె బాగా ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే వేపాకుని వాడడం ఉత్తమం.

చుండ్రు నివారణ కోసం వేప ఆకులని తీసుకుని రోజ్ వాటర్ తో కలిపి తలకి పట్టించాలి. నోరు శుభ్రం కావడానికి, దంతాలు తళతళ మెరవడానికి వేప చాలా ఉపయోగపడుతుంది.

Admin

Recent Posts