Yellow Teeth : ప్రతి మనిషి ముఖానికి అందాన్ని ఇచ్చేది చిరునవ్వు. చిరునవ్వు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేవి ముత్యాల్లాంటి పళ్ళు. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలలో ఒకటి దంతాలు పసుపు రంగులో మారడం. రంగు మారడం వలన నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. ఆ సమయంలో మాములుగా నవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. దంతాలు పసుపు రంగులోకి మారడానికి కారణం దంతాలపైన డెంటినా అనే పొర తొలగిపోవడం. దీనికి గల కారణం ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం. మీరు కనుక పళ్ళు పసుపు రంగులో గార పట్టి ఇబ్బంది పడుతుంటే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.
ఈ చిట్కాకి కావలసిన పదార్ధాలు.. లవంగాలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, టూత్ పేస్ట్. పళ్ళు పసుపు రంగులో మారాయి అంటే పళ్ళు పాడవడానికి సిద్ధంగా ఉన్నాయని అర్ధం. ఈ సమస్యను తగ్గించాలి అంటే లవంగాలు అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాలలో పళ్లపై ఉండే చెడు బ్యాక్టీరియాను చంపే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇప్పుడు లవంగాలను కచ్చాపచ్చాగా పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో అర చెంచా లవంగాల పొడి, రెండు రెబ్బల వెల్లుల్లి పేస్టు, అర చెంచా ఉప్పు, ఒక చెంచా మీరు రోజూ ఉపయోగించే టూత్ పేస్ట్ వేసి ఆ పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో పళ్ళను రెండు నిమిషాల పాటు తోముకోవాలి.
ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని రోజూ ఉపయోగించడం ద్వారా పళ్ళు ముత్యాలా తళతళా మెరుస్తాయి. పళ్ళు పుచ్చు సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. అంతే కాకుండా నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. నోటిలో ఉండే చెడు బ్యాక్టీరియాని చంపి నోటి ఆరోగ్యాన్ని రక్షించడంలో ఈ మిశ్రమం ఎంతగానో సహాయపడుతుంది. దీని వల్ల దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరుస్తాయి.