నిత్యం శారీరక శ్రమ చేసే వారికి, వ్యాయామం ఎక్కువ సేపు చేసిన వారికి, అనారోగ్యం లేదా ఇతర కారణాల వల్ల ఒక్కోసారి కండరాల నొప్పులు వస్తుంటాయి. సాధారణంగా అయితే ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. కానీ అవే నొప్పులు ఒక వేళ ఎక్కువ సేపు ఉంటే అప్పుడు ఎవరైనా నొప్పి మాత్రలు గానీ, పెయిన్ కిల్లర్ స్ర్పేలను గానీ వాడుతారు. ఈ క్రమంలో నొప్పి కూడా తగ్గిపోతుంది. కానీ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అయితే అలాంటి ఎఫెక్ట్స్ ఏవీ కలగకుండా అత్యంత సహజ సిద్ధమైన పద్ధతిలో కండరాల నొప్పులను తగ్గించుకోవచ్చు.
పైన చెప్పిన విధంగా సహజ సిద్ధమైన పద్ధతిలో కండరాల నొప్పులను తగ్గించుకోవాలంటే అందుకు ఓ పవర్‌ఫుల్ ఔషధాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఔషధానికి అవసరమైనవి కూడా కేవలం 3 పదార్థాలు మాత్రమే. అవి కూడా మనకు మార్కెట్‌లో సులభంగా దొరుకుతాయి. పైగా మందులు, మాత్రలు, స్ప్రేల కన్నా వీటికయ్యే ఖర్చు చాలా తక్కువ. ఈ క్రమంలో సదరు నాచురల్ మెడిసిన్‌ను ఎలా తయారు చేయాలో, అందుకు ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నాచురల్ మజిల్ పెయిన్ ఆయిల్ తయారీకి కావల్సిన పదార్థాలు… నువ్వుల నూనె – 75 ఎంఎల్, కట్ చేసిన వెల్లుల్లి రేకులు – 10, బ్లాక్ సాల్ట్ – 3/4 టీస్పూన్.
తయారీ విధానం… ఒక పాత్రలో నువ్వుల నూనెను తీసుకుని అందులో వెల్లుల్లి, బ్లాక్ సాల్ట్‌లను కలపాలి. మిశ్రమంగా కలిపాక ఆ ఆయిల్‌ను సన్నని మంటపై వేడి చేయాలి. మొదట్లో నూనె నుంచి చిట పటలు వస్తాయి. అయినా మధ్య మధ్యలో ఒక స్పూన్‌తో ఆయిల్‌ను కలుపుతూ ఉండాలి. వెల్లుల్లి రేకులు నలుపు రంగులోకి మారేంత వరకు ఆయిల్‌ను వేడి చేయాలి. అనంతరం స్టవ్ ఆర్పి ఆయిల్‌ను దించి చల్లారే వరకు ఆగాలి. ఆయిల్ చల్లారాక దాన్ని శుభ్రమైన బట్టతో ఒక జార్‌లోకి వడ పోసుకోవాలి. జార్‌లోకి వంపబడిన ఆయిల్ నల్లగా, డికాషన్‌ను పోలి ఉంటుంది. ఈ ఆయిల్‌ను సమస్య ఉన్న ప్రదేశంలో సున్నితంగా మర్దనా చేస్తూ రాసుకోవాలి. దీంతో కండరాల నొప్పులు వెంటనే తగ్గిపోతాయి.