Turmeric Face Pack : ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళ అందాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటుంటారు. అందంగా ఉండాలని ఎవరికి ఉండదు..? ప్రతి ఒక్కరు కూడా, వారి యొక్క అందాన్ని పెంపొందించుకోవడానికి, రకరకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది, మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయని, వాటిని వదిలేసి ఇంటి చిట్కాలని పాటిస్తున్నారు. ఇంటి చిట్కాలతో కూడా, మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మొటిమలు, మచ్చలు వంటి సమస్యల నుండి కూడా బయటపడడానికి, కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి. పురాతన కాలం నుండి, పసుపు కి ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. పసుపులో ఉన్న లక్షణాలు, చర్మ సంరక్షణకు బాగా ఉపయోగపడతాయి.
చర్మ సమస్యలను కూడా తగ్గించగలవు. ఈరోజుల్లో అందాన్ని కాపాడుకోవడం పెద్ద సవాల్ అయిపోయింది. టైం కుదరట్లేదు, పొల్యూషన్ ఇలా రకరకాల కారణాల వలన అందం పాడవుతుంది. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వలన అయితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. కేవలం పదే నిమిషాల్లో మీరు మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఒక స్పూన్ పసుపులో ఒక స్పూన్ నిమ్మరసం వేసి, ముఖానికి బాగా పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి, అరగంట పాటు అలా వదిలేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.
మొటిమలు, బ్లాక్ హెడ్స్ కూడా ఈజీగా తొలగిపోతాయి. ముఖం, అందంగా కాంతివంతంగా తయారవుతుంది. ముఖం నిర్జీవంగా మారినట్లయితే, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. పాలమీగడలో పసుపు కలిపి ముఖానికి రాసి అరగంట పాటు వదిలేసి, తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకుంటే కూడా స్కిన్ బాగుంటుంది.
రెండు స్పూన్లు పాలు తీసుకుని, అందులో అర టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి దూదితో ముఖానికి పట్టించి, ఐదు నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే చర్మం జిడ్డు పోతుంది. మురికి కూడా తొలగిపోతుంది. గంధం, పసుపు, రోజ్ వాటర్ కూడా బాగా పనిచేస్తాయి. ఇలా ఈ ఇంటి చిట్కాలతో అందాన్ని పెంపొందించుకోవచ్చు.