అధిక బ‌రువు త‌గ్గి స‌న్న‌గా మారాలంటే పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు, సూచ‌న‌లు..!

అధికంగా బ‌రువు ఉన్న‌వారు ఆ బ‌రువు త‌గ్గి స‌న్న‌గా మారాలంటే రోజూ అనేక క‌ఠిన నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలు, సూచ‌న‌లు బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. వాటిని పాటిస్తే అధిక బ‌రువును త‌గ్గించుకుని స‌న్న‌గా మార‌వ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు, చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

weight loss ayurvedic remedies and tips

అధిక బ‌రువు త‌గ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు

* ముల్లంగి రసాన్ని 3 టీస్పూన్ల చొప్పున రోజుకు 3 సార్లు తీసుకోవాలి.

* క‌ర‌క్కాయ పెచ్చుల‌ను చూర్ణం చేయాలి. దాన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని అందులో అంతే మోతాదులో తేనె లేదా వేడి నీరు క‌లపాలి. ఈ మిశ్ర‌మాన్ని 2 పూటలా తీసుకోవాలి.

* రేగు ఆకులను చిన్న‌ ముద్దగా చేసి ఉలవచారు లేదా శనగలతో చేసిన చారుతో కలిపి తీసుకోవాలి.

* ప్రతి రోజూ ఉదయం ప‌ర‌గ‌డుపునే ఒక తమలపాకులో 5 మిరియాల‌ గింజలను చుట్టి తిని వెంటనే ఒక గ్లాసు నీటిని తాగాలి.

* ఆముదం ఆకులను కాల్చి బూడిద చేసి నిల్వ చేసుకోవాలి. ఆ మిశ్ర‌మాన్ని చిటికెడు చొప్పున తీసుకుని అందులో చిటికెడు ఇంగువ పొడిని కలిపి రెండు పూటలా బియ్యం కడిగిన నీళ్లతో కలిపి తీసుకోవాలి.

* అర టీ స్పూన్ వాయు విడంగాల చూర్ణాన్ని తేనెతో కలిపి 2 పూటలా తీసుకోవాలి.

అధిక బ‌రువు త‌గ్గేందుకు ఆయుర్వేద సూచనలు

* రోజూ ఆహారంలో అన్ని రుచులు క‌లిసిన ప‌దార్థాలు ఉండేలా చూసుకోవాలి. అన్ని రుచులు ఉన్న ఆహారాల‌ను రోజూ తినాలి. వేపుళ్ల‌కు బ‌దులుగా సాధార‌ణ కూర‌ల‌ను తినాలి.

* భోజ‌నం చేసిన‌ప్పుడ‌ల్లా జీర్ణాశ‌యంలో కొద్దిగా ఖాళీ ఉండేట్లు తినాలి. అవ‌స‌రం అయితే త‌క్కువ మొత్తాల్లో ఎక్కువ సార్లు భోజ‌నం చేయాలి.

* వ్యాయామానికి ముందు 2 టీస్పూన్ల‌ తేనెను ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి.

* ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. ఓట్స్, బార్లీ, చిరుధాన్యాలు, ఏడాది పాతబడిన బియ్యం తినాలి.

* చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగ‌రాదు. గోరు వెచ్చని నీళ్ల‌ను తాగాలి. అలాంటి నీళ్ల‌తోనే స్నానం చేయాలి.

* పెరుగుకు బ‌దులుగా ప‌లుచ‌ని మజ్జిగను తీసుకోవాలి.

Share
Admin

Recent Posts