మన వంట ఇంటి పోపు దినుసుల్లో మెంతులు కూడా ఒకటి. మెంతులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. ఈ క్రమంలోనే రూ.10 పెట్టి మెంతులను కొంటే వారం రోజుల వరకు వాటిని ఉపయోగించుకోవచ్చు. వారం రోజుల పాటు మెంతులను వాడితే మీ శరీరంలోని కొలెస్ట్రాల్ లెవల్స్ ఇట్టే కరిగిపోతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. ఆయుర్వేదంలో మెంతులను ఎన్నో సంవత్సరాల నుంచే ఉపయోగిస్తున్నారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
మెంతుల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలోని ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గిస్తుంది. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతుంది. మెంతుల్లో ఉండే సమ్మేళనాలు శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా శోషించుకునేలా చేస్తాయి. దీంతో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మెంతులను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
మెంతులను రాత్రిపూట 1 టీస్పూన్ మోతాదులో నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీళ్లను తాగి ఆ మెంతులను తినాలి. ఇక మెంతులను పొడి చేసి దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ పొడి వాసన అందరికీ పడదు. కనుక ఈ పొడిని మజ్జిగలో కలిపి తాగితే మంచిది. అలాగే మెంతులను వేసి నీటిని మరిగించి ఆ నీళ్లను కూడా తాగవచ్చు. దీంతో కూడా లాభాలను పొందవచ్చు. అలాగే మెంతులను మీరు రోజూ తినే ఆహారంలో నేరుగా తినవచ్చు. ప్రతి రోజూ భోజనం చేసే ముందు మొదటి ముద్దలో మెంతుల పొడిని కలిపి తినవచ్చు. ఇలా మెంతులను ఎలా తీసుకున్నా కూడా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా వీటిని తింటే చాలా తక్కువ ఖర్చుతోనే కొలెస్ట్రాల్ లెవల్స్ ను కరిగించుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.