మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. లివర్ పనితీరు బాగుంటేనే ఇతర అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి. కానీ మనం పాటించే జీవన విధానం వల్ల లివర్ పనితీరు దెబ్బ తింటుంది. అప్పుడు లివర్ మనకు పలు లక్షణాలను తెలియజేస్తుంది. దీంతో లివర్‌ను క్లీన్ చేసుకోవాలని అర్థం. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి లివర్‌ను క్లీన్ చేసుకోవడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. రోగాలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ అనే లివర్ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. ఇక లివర్ పనితీరు మందగిస్తే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
మీ శరీరం లేదా పొట్ట భాగంలో బాగా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. మీ చర్మం పసుపు రంగులోకి మారిపోతుంది. చర్మంపై అక్కడక్కడా కొందరికి తెల్లని మచ్చలు కూడా కనిపిస్తాయి. అలాగే కళ్లు కూడా పసుపు రంగులోకి మారుతాయి. ఆకలి ఉండదు. నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. తీవ్రమైన అలసట ఉంటుంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. జీర్ణ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా గుండెల్లో మంట, అజీర్తి ఉంటాయి. కనుక ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్‌ను క్లీన్ చేయాలని అర్థం. అయితే ముందుగా డాక్టర్‌ను సంప్రదించి మందులను వాడాలి. దాంతోపాటు పలు చిట్కాలను పాటిస్తే లివర్ క్లీన్ అవుతుంది. ఈ చిట్కాలను ప్రతి 15 రోజులకు ఒకసారి పాటించవచ్చు. దీంతో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపునే తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నవారు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తరువాత 30 నిమిషాల పాటు విరామం ఇచ్చి ఆ తరువాత తాగాలి. ఇక రాత్రి పూట కిస్మిస్‌లను గుప్పెడు నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటుండాలి. ఇలా చేస్తున్నా కూడా లివర్ క్లీన్ అవుతుంది. ఉదయం పూట ప్రతి రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి తింటుండాలి. తరువాత నీళ్లు తాగాలి. ఇలా చేస్తున్నా కూడా లివర్‌ను క్లీన్ చేసుకోవచ్చు.
ఉదయం పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె కలిపి తాగుతుండాలి. తేనె లివర్ ను క్లీన్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీంతోపాటు నిమ్మకాయను కూడా వాడవచ్చు. ఉదయం పరగడుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తాగవచ్చు. గ్యాస్ ఉన్నవారు బ్రేక్‌ఫాస్ట్ చేశాక తాగాలి. నిమ్మరసంలో అవసరం అనుకుంటే మిరియాల పొడి, ఉప్పు కలిపి తాగవచ్చు. దీంతో రుచిగా ఉంటుంది. ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. అలాగే పాత బెల్లం, పసుపు కలిపి చిన్న చిన్న ట్యాబ్లెట్ల మాదిరిగా చేసి రోజూ ఒక ట్యాబ్లెట్‌ను వేసుకుంటుండాలి. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల మీ లివర్‌ను ఎల్లప్పుడూ క్లీన్ చేసుకుని శుభ్రంగా ఉంచుకోవచ్చు. దీంతో ఇతర అవయవాలు కూడా చక్కగా పనిచేస్తాయి.