Home Tips

చికెన్ కొనేందుకు వెళ్తున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోండి..!

ఆదివారం వ‌స్తే చాలు, చాలా మంది చికెన్ లేదా మ‌ట‌న్ తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. మ‌ట‌న్ ఖ‌రీదు ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక దాన్ని ఎప్పుడో ఒక‌సారి గానీ తిన‌రు. ఇక చికెన్ అయితే ఆదివారం అనే కాదు, వారంలో ఏ రోజు తినాల‌ని అనిపిస్తుందో అప్పుడు తినేస్తుంటారు. అయితే చికెన్ కొనేందుకు వెళ్లే వారు ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. అవేమిటంటే..

* కోళ్ల‌ను అప్పుడే క‌ట్ చేసి చికెన్ చేసి ఇస్తే తాజాగా ఉంటాయి. కానీ కొంద‌రు దుకాణ‌దారులు చికెన్‌ను ఎప్పుడో త‌యారు చేసి ఉంచుతారు. అలాంటి చికెన్‌ను తీసుకోరాదు. ఎందుకంటే మాంసంలో స‌మ‌యం గ‌డిచే కొద్దీ బాక్టీరియా త‌యార‌వుతుంది. క‌నుక చికెన్‌ను తాజాగా త‌యారు చేయించి కొనుగోలు చేయాలి. ఇక చికెన్ కొనేట‌ప్పుడు కూడా తాజాగా ఉందో లేదో చెక్ చేయాలి. అంత‌కు ముందే క‌ట్ చేసింది అయితే కొద్దిగా రంగు మారుతుంది. బ్రౌన్ రంగులో క‌నిపిస్తుంది. అలాగే తాజా చికెన్‌కు వ‌చ్చే వాస‌న రాదు. వేరేగా ఉంటుంది. వాటిని వాస‌న చూడడం ద్వారా ఆ తేడాను క‌నిపెట్ట‌వ‌చ్చు. క‌నుక చికెన్‌ను తాజాగా ఉండేలా చూసుకోవాలి. దీంతో దాన్ని వండుకుని తిన్నా అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

are you going to buy chicken then know these first

* తాజా చికెన్ ఎల్ల‌ప్పుడూ లేత పింక్ రంగులో క‌నిపిస్తుంది. చికెన్ ను క‌ట్ చేసిన‌ప్పుడు కూడా పింక్ రంగులో ద‌ర్శ‌న‌మిస్తుంది. చికెన్ లోప‌లి భాగం పింక్ క‌లర్‌లో లేక‌పోతే ఆ చికెన్ తాజాగా లేద‌ని అర్థం చేసుకోవాలి. అలాగే తాజా చికెన్‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు క‌నిపిస్తుంటాయి.

* ఫ్రిజ్ లో నిల్వ చేసిన చికెన్‌ను చాలా మంది విక్ర‌యిస్తుంటారు. మ‌న‌కు డెలివ‌రీ యాప్‌ల ద్వారా వ‌చ్చే చికెన్ అలాంటిదే. క‌నుక దాన్ని కొన‌రాదు. తాజాగా క‌ట్ చేయించి తీసుకోవాలి. లేదంటే తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

* ప్యాక్ చేయ‌బ‌డిన చికెన్‌ను కూడా తిన‌రాదు. అది కూడా నిల్వ చేసిన చికెన్ కింద‌కే వ‌స్తుంది. క‌నుక చికెన్‌ను తాజాగా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామ‌ని తెలుసుకోండి.

Admin

Recent Posts