Home Tips

మీ ఇంట్లోకి బ‌ల్లులు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!

మీ బెడ్ రూంలో ఉన్న ఏదో ఒక బల్బ్ మీద పెర్ ఫ్యూం స్ప్రే చేయండి. ఆ లైట్ వేసినప్పుడు. మీబెడ్ రూం అంతా సువాసనతో నిండిపోతుంది. మంచి మంచి సీనరీలు, పెయింటింగ్స్ ఉన్న క్యాలెండర్లు సంవత్సరాంతరంలో పడేయకుండా గ్రీటింగుల్లా కత్తిరించుకుంటే వాటిని ఫ్రేం కట్టించుకొని గోడకు అలంకరించుకోవచ్చు. మనం ఎన్ని సార్లు తోలినా బల్లులు ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. అలా రాకుండా చేయాలంటే ఒక చిట్కా ఉంది. ప్రయోగించి చూడండి. బల్లులు ఎటునుంచి లోపలికి వస్తుంటాయో ఆదార్లో కోడి గుడ్డు డొల్లను (షేల్) ఒకటో, రెండో పెట్టి చూడండి. బల్లులు రావు. మనం రంగు వెలసిన గలీబులు అలుకు గుడ్డలుగా వాడేబదులు దిండ్లకు ఎక్కించి పైన మంచి గలీబులు తొడిగితే, నూనె మరకలు దిండు వరకూ ఇంకకుండా శుభ్రంగా ఉంటాయి. మార్బుల్ ఫ్లోరింగ్ రంగు మారకుండా తెల్లగా మెరుస్తూ ఉండాలంటే ఒక బకెట్ నీళ్ళలో సగం ప్యాకెట్ షాంపూ వేసి మార్బుల్ బండలు తుడిస్తే తెల్లగా ఉంటాయి. షాంపూల్లో గాఢమైన యాసిడ్స్ ఉండవు కాబట్టి బండలు దెబ్బతినవు. టాయ్‌లెట్స్ కూడా మార్బుల్స్ వేసినప్పుడు యాసిడ్స్ వంటివి వాడకుండా ఉంటే మంచిది.

యాపిల్సు కొనేటప్పుడు నలుపలకలుగా వున్నవి ఎన్నుకోవాలి. యిస్త్రీ పెట్టె మరకలను తినే సోడాలో ముంచిన గుడ్డతో తుడిస్తే మరకలు పోతాయి. రూం ఫ్రెషర్ తో అద్దాలు కూడ క్లీన్ చేయవచ్చు కూడా. లెదర్ తో తయారైన బ్యాగులు, ఇతర వస్తువులు నీటిలో తడిస్తే వెంటనే గదిలో ధారాళంగా గాలివచ్చే చోట ఉంచి నీడపట్టునే ఆరనివ్వాలి. అంతేకానీ వాటిని ఎండలో పెడితే సహజకాంతిని కోల్పోతాయి. మృదుత్వాన్ని కోల్పోయి పెళుసుగా అనిపిస్తాయి. లెదర్ పర్సుకు కొద్దిగా ఆలివ్ నూనె రాయాలి. అర గంట తర్వాత మృదువైన వస్త్రంతో తుడిస్తే కొత్త దానిలా మెరుస్తుంది. లిప్ స్టిక్ విరిగిపోతే రెండు ముక్కల కొనలని నిప్పుమీద కొన్ని సెకన్లు వేడిచేసి దగ్గరికి నొక్కి, ఫిజ్ లో పెడితే గట్టిపడుతుంది. వంటి సబ్బు ముక్కలతో చేతి రుమాళ్ళను ఉతికితే సబ్బు ఆదా అవుతుంది. చేతి రుమాళ్ళు మంచి సువాసన కూడా వస్తాయి.

follow this tip to prevent lizards coming to your home

వంటింటి సింకులో నుంచి వాసన వస్తోంటే రెండు కప్పుల బ్లీచింగ్ పౌడర్ నీటిలో కలిపి రాత్రి పూట సింకులో పోసి వదిలేయాలి.పొద్దున్నే బాగా నీరు పోస్తే శుభ్రమవుతుంది. వాడేసిన ఇయర్ బడ్స్ దూదిని తీసి ఆ స్థానంలో కాటన్ ఊలు చుడితే ఆడియో టేప్ లాంటివి శుభ్రపరచుకోవడానికి ఉపయోగపడతాయి. వాడేసిన టీపొడిని కాల్చితే వచ్చే పొగ దోమలను తరిమి కొడుతుంది. వెనిగర్ కలిపిన నీటితో వంట గదిలో గట్టును తుడిస్తే చీమలు రావు. వార్డ్ రోబ్ లో ఒక మూల ఎండుమిరపకాయలు పెడితే తోకపురుగులు రాకుండా ఉంటాయి. వాష్ బేసిన్ రంధ్రాలు మూసుకుపోతే ఉప్పు కలిపిన వేడినీళ్ల ని పోస్తే శుభ్రపడతాయి. షూ పాలిష్ గడ్డకడితే అందులో నాలుగు ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసి కలిపితే మామూలుగా తయారవుతుంది. సంవత్సరం పూర్తయిన తరువాత క్యాలెండర్ పడేయకుండా వాటిని సైజుల వారీగా కత్తిరించుకొని నోట్‌బుక్స్ కుట్టుకుంటే రఫ్‌వర్క్స్ చేసుకునేందుకు ఉపయోగపడతాయి.

Admin

Recent Posts