Counting Money : మన దగ్గర ఉండే డబ్బుని మనం ఒక్కొక్క సారి లెక్కపెడుతూ ఉంటాము. డబ్బు అంటే లక్ష్మీదేవి. డబ్బులలో లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. ఎలాంటి ఆర్థిక సమస్యలూ కూడా లక్ష్మీ దేవి ఉన్న ఇంట్లో ఉండవు. ఎక్కువ మంది డబ్బుల్ని లెక్కపెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులను చేయకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటే లక్ష్మీ దేవికి ఆగ్రహం కలగకుండా ఉంటుంది.
ఒకవేళ కనుక లక్ష్మీదేవికి కనుక ఆగ్రహం వచ్చిందంటే, ఒక్క రూపాయి కూడా ఇంట్లో నిలవదు. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు కానీ ఇతరులకి డబ్బులని ఇచ్చేటప్పుడు కానీ, ఈ పొరపాట్లని అస్సలు చేయకండి. ఈ పొరపాట్లు కనుక చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. నిర్లక్ష్యంగా డబ్బులు విషయంలో ప్రవర్తించకూడదు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టకూడదు. ఎక్కడపడితే అక్కడ డబ్బులు ఉంచడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది.
కొంచెం డబ్బులనైనా సరే పర్సులలో పెట్టుకోవాలి. లేదంటే బీరువా లో పెట్టుకోవాలి. అంతే కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. చేతిలో నుండి డబ్బులు జారిపోతే వెంటనే కళ్ళకు అద్దుకోవాలి. రాత్రి అస్సలు మంచం మీద డబ్బుల్ని పెట్టకూడదు. ఎప్పుడూ కూడా శుభ్రమైన ప్రదేశంలోనే డబ్బులు పెట్టుకోవాలి.
ఎప్పుడు కూడా ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు విసిరినట్లు డబ్బులు ఇవ్వకూడదు. అలా చేయడం వలన డబ్బుని మీరు అవమానించినట్లు. డబ్బులు ని లెక్క పెట్టేటప్పుడు ఉమ్మి తడి చేసుకుని, డబ్బులు లెక్క పెట్టకూడదు. ఇలా ఈ తప్పుల్ని చేయకుండా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. లేకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.