భారతీయ రైల్వే నిత్యం ఎంతో మందిని గమ్య స్థానాలకి చేర్చడం మనం చూస్తూ ఉన్నాం. దేశ వ్యాప్తంగా దాదాపు 68 వేల రూట్ కిలోమీటర్ల రైల్వే మార్గం ఉండగా, ఇందులో నిత్యం కొన్ని వేల మంది ప్రయాణిస్తున్నారు. రైలులో సురక్షిత ప్రయాణంతో పాటు తక్కువ ఛార్జీలతో ప్రయాణించవచ్చు. అయితే వాతావరణం అనుకూలించనప్పుడు రైలు నడపడంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారన్న విషయం మనందరికి తెలిసిందే.సాధారణంగా వాతావరణం అనుకూలించనప్పుడు రైలు నడపడంలో లోకో పైలెట్ ఇబ్బందులు పడతాడు. అయితే ఈ సమస్యలకు ఇంజిన్‌లోని శాండ్ బాక్స్ పరిష్కారం చూపుతుంది.
వర్షాలు పడినప్పుడు లేదా పొగమంచు వలన రైల్వే ట్రాక్‌లు తడిసిపోతుంటాయి. దీంతో రైలు ముందుకు కదలడానికి మొరాయిస్తుంటుంది. ఇలాంటి సమయంలో లోకో పైలట్ వెంటనే ఓ స్విచ్ చొక్కుతాడు.. రైలు ముందుకు కదులుతుంది. ఇంజిన్ కి అమర్చిన ఇసుక పెట్టె ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. రైలు చక్రాల దగ్గర ఇసుకను నింపడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఇది చక్రాలు మరియు రైలు ట్రాక్ మధ్య ఘర్షణను పెంచుతుంది, ఇది రైలు బ్రేకింగ్ మరియు ట్రాక్షన్‌ను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా రైలు అకస్మాత్తుగా ఆపడానికి ప్రయత్నించినప్పుడు లేదా తడి ట్రాక్‌లు లేదా వాలు వంటి జారే ట్రాక్ మీద నడుస్తున్నప్పుడు, చక్రం మరియు ట్రాక్ మధ్య తగినంత ఘర్షణ లేకపోవడం. అటువంటి పరిస్థితిలో, ఇసుకను ఉపయోగించడం ద్వారా ఘర్షణ పెరుగుతుంది, తద్వారా చక్రాలు జారిపోకుండా రైలు సురక్షితంగా వెళ్లేందుకు ఉపయోగపడుతుంది.
రైళ్లను నడిపే లోకో పైలట్లు ఇసుక బాక్సులను ఉపయోగించి ట్రాక్‌లపై ఇసుకను చల్లుతుంటారు. వాలుని ఎక్కేటప్పుడు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తద్వారా చక్రాలు ట్రాక్‌పై పట్టును కలిగి ఉంటాయి మరియు రైలు సాఫీగా ముందుకు సాగడానికి వీలుగా ఉంటుంది.. ఈ వ్యవస్థ చాలా సంవత్సరాలుగా వాడుకలో ఉంది, ఇది ప్రయాణీకులని సురక్షితంగా ఉంచడమే కాకుండా రైలును సురక్షితంగా బ్రేక్ చేయడానికి కూడా సహాయపడుతుంది.