ఈ రోజుల్లో పాన్ కార్డ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖతో ప్రతి లావాదేవీకి శాశ్వత ఖాతా సంఖ్య తప్పనిసరి చేయబడడంతో పాన్ తప్పనిసరిగా మారింది. మన దేశంలో వివిధ రకాల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి పర్మనెంట్ అకౌంట్ నంబర్ (PAN) అవసరం. కొన్ని సబ్సిడీలు, పెన్షన్లు వంటి ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి కూడా దీనిని ప్రామాణికం చేశారు. ఇది ఒక ఐడీ కార్డుగా కూడా పనిచేస్తుంది. పాన్ అనేది పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ నంబర్. దీన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ జారీ చేస్తుంది. ట్యాక్స్ ప్రొసీడింగ్స్, ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడం, పన్ను ఎగవేతను నిరోధించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పర్మినెంట్ అకౌంట్ నెంబర్ అయిన పాన్ కార్డుపై 10 డిజిట్స్ ఉంటాయి. వ్యక్తిగతంగా కార్డు తీసుకున్నా.. లేదా ఏదైనా సంస్థ తీసుకున్నా పాన్ నెంబర్‌లో 10 డిజిట్స్ తప్పక ఉంటాయి. అయితే పాన్ నెంబర్‌లోని 10 అంకెల్లో ఒక్కో డిజిట్‌కు ఒక్కో అర్థం ఉంటుంది. ఆ నెంబర్లకే ప్రత్యేక ఉంటుంది. ఈ విషయాలు పెద్దగా ఎవరికి తెలిసి ఉండదు.అయితే పాన్ నెంబర్‌లోని మొదటి మూడు డిజిట్స్ AAA నుంచి ZZZ వరకు ఉంటాయి. అది కూడా ఆల్ఫాబెటిక్ సిరీస్‌గా ఉంటాయి. నాలుగో అంకె పాన్ హోల్డర్ స్టేటస్‌ను తెలియజేస్తుంది. అయితే ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డు సంస్థలతో పాటు వ్యక్తులకు జారీ చేస్తుంది. పాన్ హోల్డర్ స్టేటస్‌ను బట్టి పాన్ నెంబర్‌లో నాలుగో అంకె ఉంటుంది.
అది A- అసోసియేట్ ఆఫ్ పర్సన్స్ B – బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ C – కంపెనీ (సంస్థ) F- ఫర్మ్ (లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్) G – గవర్నమెంట్ ఏజన్సీ (ప్రభుత్వ సంస్థ) H – హిందూ అవిభాజ్య కుటుంబం (HUF) J- ఆర్టిఫిషియల్ జ్యురిడికల్ పర్సన్ L – లోకల్ అథారిటీ P – పర్సన్ (వ్యక్తి) T – ట్రస్ట్ అనే ఈ లెటర్స్ ఉంటాయి.వ్యక్తిగతంగా పాన్ కార్డ్ తీసుకునేవారందరికీ నాలుగో లెటర్ ‘P’ అనే ఉంటుంది. ఇక పాన్ నెంబర్‌లో ఐదో లెటర్ దరఖాస్తుల వ్యక్తి లేదా, ఇంటి పేరులో మొదటి అక్షరంగా ఉంటుంది. పాన్ నెంబర్‌లో 6 నుంచి 9వ లెటర్ 0001 నుంచి 9999 నెంబర్ మధ్య ఉంటుంది. ఇక పాన్ నెంబర్‌లోని 10వ డిజిట్‌ను ఆల్ఫబెటిక్ చెక్ డిజిట్ అంటారు.
మొదటి 9 డిజిట్స్‌కు ఫార్మూలా అప్లై చేసి చివరి డిజిట్‌ను కంప్యూటర్ జెనరేట్ చేస్తుంది. ఇలా దరఖాస్తు దారుడు పేరు, ఇంటి పేరు, వ్యక్తిగతంగా దరఖాస్తు చేస్తున్నాడా..? లేదా ఏదైనా వ్యాపార సంస్థ తరపున చేస్తున్నారా.? అనే వివరాలను బట్టి ఈ 10 డిజిట్స్‌ను క్రియేట్ చేస్తుంది ఆయదాపను పన్ను శాఖ.డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, రూ.50వేల కంటే ఎక్కువ మొత్తంలో క్యాష్ పేమెంట్లు చేసినప్పుడు, విదేశీ ప్రయాణం లేదా విదేశీ కరెన్సీ కోసం రూ.50వేల కంటే ఎక్కువ మొత్తంలో పేమెంట్ చేసినప్పుడు, మ్యూచువల్ ఫండ్స్ కోసం రూ.50కంటే ఎక్కువ పేమెంట్స్ చేసినప్పుడు పాన్ వివరాలు తప్పనిసరిగా సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.