ఈ టెక్నాలజీ కాలంలో ప్రతిదీ కష్టం లేని పని అయిపోయింది.. ఒకప్పుడు చాలామంది వంట చేసుకోవాలంటే కట్టల పోయి వాడేవారు. ఆ కట్టెలు తెచ్చుకోవాలంటే శారీరక శ్రమ తప్పేది కాదు. ప్రస్తుతం ఇవి కనిపించడం లేదు ఎవరి ఇంట్లో చూసినా గ్యాస్ స్టవ్ తప్పనిసరి అయిపోయింది. గ్యాస్ సిలిండర్ అనేది ఒక నిత్యావసర సరుకుల మారిపోయింది.. మరి ఇన్ని రోజుల నుండి మనం గ్యాస్ వాడుతున్నాము కానీ దానిపై ఉండే కొన్ని అంకెల సంకేతాలను మనం గుర్తించలేదు.. మరి వాటి అర్థం ఏంటి.. దాని వెనుక ఉన్న మర్మం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం..
గ్యాస్ సిలిండర్ పై భాగంలో ఇంగ్లీష్, అంకెలలో కొన్ని నెంబర్లు రాసి ఉంటాయి.. వాటి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే.. ప్రతి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది.. అలాగే సిలిండర్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది.. ఆ డేట్ చెప్పేవే ఈ అంకెలు. వీటి ఆధారంగానే సదరు సిలిండర్ ఎక్స్పైరీ డేట్ ఏంటనేది తెలుసుకోవచ్చు..
A: అని ఉంటే జనవరి నుంచి మార్చి వరకు అని అర్థం, B: అని రాసి ఉంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, C: జూలై నుంచి సెప్టెంబర్ వరకు అని అర్థం వస్తుంది..
సిలిండర్ పై B 13 అని రాసి ఉంది. అంటే 2013 ఏప్రిల్ నుంచి జూన్ వరకు సదరు సిలిండర్ ఎక్స్పైరీ డేట్ అని అర్థం. దీని ద్వారానే గ్యాస్ ఏజెన్సీ వారు సిలిండర్ క్వాలిటీని చెక్ చేస్తారు. ఒకవేళ ఏమైనా లీకేజీలు వస్తే వాటిని సరిచేసి కస్టమర్లకు పంపిస్తారు. ఒకవేళ సిలిండర్ జీవితకాలం ముగిస్తే దానిని స్క్రాప్ కు పంపిస్తారు. మీరు కూడా మీ సిలిండర్ ని ఒకసారి చెక్ చేయండి.