మెత్తని, సౌకర్యవంతమైన పరుపుపై పడుకుంటేనే కదా, ఎవరికైనా హాయిగా నిద్ర పడుతుంది. దీంతో శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది. అంతేకాదు, ఒళ్లు నొప్పులు కూడా ఉండవు. అయితే చాలా మంది పరుపులను అయితే కొంటారు. తమకు కావల్సిన విధంగా ఏదో ఒక బ్రాండ్‌కు చెందిన పరుపులను కొంటారు. కానీ అసలు నిజానికి అలా కాదు. మనకు సరిపోయే కరెక్ట్ పరుపులను కొనేందుకు కూడా కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. వాటి గురించే కింద ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరుపులను కొనేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. సాఫ్ట్‌నెస్ అంటే మెత్తగా, మృదువుగా ఉండేలా, వెన్నెముకకు మంచి సపోర్ట్ ఇచ్చే కరెక్ట్ సైజ్ ఉన్న పరుపులు కొనాలి. పరుపులో మెత్త దనం కోసం ఎలాంటి మెటీరియల్‌ను వాడారు అన్నది గమనించాలి. వెన్నెముకకు ఇబ్బంది ఉంటుందా, లేదా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇక చివరిగా హైట్, మంచం పొడవు, వెడల్పులకు అనుగుణంగా పరుపును తీసుకోవాలి.
ఈ భూమిపై ఉండే ప్రతి వస్తువుకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా మనం తయారు చేసే ప్రతి వస్తువుకు అది వర్తిస్తుంది. అలాగే పరుపులకు కూడా. మీరు కొనే పరుపులు ఎన్ని సంవత్సరాల వరకు మన్నుతాయో కచ్చితంగా అడిగి తెలుసుకోండి. లేదంటే చాలా త్వరగా పాడైతే అప్పుడు డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. ఏదైనా ఒక పరుపును కొనాలని మీరు ఫిక్స్ అయితే దానిపై కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు పడుకోండి. అటు, ఇటు దొర్లి చూడండి. వివిధ యాంగిల్స్‌లో పడుకుని చూడండి. ఈ క్రమంలో ఆ పరుపు స్టైల్, కంఫర్ట్, డిజైన్ అన్నీ నచ్చితేనే పరుపు కొనండి. సేల్స్‌మెన్ తొందర పెట్టినా కంగారు పడకండి.
చాలా వరకు కంపెనీలు పరుపులతో పాటే దిండ్లను కూడా అందిస్తుంటాయి. అలా దిండ్లు వస్తేనే తీసుకోండి. ఇక ఆ దిండ్లు కూడా ఎలా ఉన్నాయో పరిశీలించండి. వాటి నాణ్యతను టెస్ట్ చేయండి. పరుపుల్లాగే అవి కూడా సేమ్ మెటేరియల్‌తో తయారు చేశారా, లేదా అన్న విషయాన్ని ధృవీకరించుకోండి. ఏ వస్తువునైనా ఆ వస్తువును అమ్మే నిర్దిష్టమైన వర్తకుని వద్దే కొనాలి. ఎందుకంటే వారే ఆ రంగంలో నైపుణ్యం కలిగి ఉంటారు. అలాగే పరుపులను వాటిని అమ్మే స్టోర్స్‌లోనే కొనండి. అంతేకానీ రోడ్డు పక్కన పెట్టి అమ్మేవి, గ్రోసరీ స్టోర్స్‌లో ఉండేవి, ఇతర ప్రదేశాల్లో పెట్టి అమ్మే పరుపులను కొనకండి. వాటిల్లో నాణ్యమైన సరుకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
చాలా వరకు కంపెనీలు ఇప్పుడు పరుపులకు గరిష్టంగా 10 సంవత్సరాల వారంటీని అందిస్తున్నాయి. దీంతో పరుపుకు ఏదైనా డ్యామేజీ కలిగితే ఫుల్ రీప్లేస్‌మెంట్ కూడా అందిస్తున్నారు. కనుక అలాంటి కంపెనీలపై దృష్టి పెట్టండి. ఇక వారంటీ పరుపులో దేనికి ఇస్తున్నారో కచ్చితంగా తెలుసుకోండి. పరుపు లోపల ఉండే మెటీరియల్‌కా, లేక పరుపు పైన ఉండే కవర్‌కా అన్న విషయాలను కచ్చితంగా ధృవీకరించుకున్నాకే పరుపును కొనుగోలు చేయండి.