మీరు కారు ఇంజిన్ స్టార్టు చేసిన వెంటనే AC ని ఆన్ చేస్తున్నారా.. ఈ తప్పు 100 కి 90 మంది చేస్తుంటారు. ఇలా చెయ్యటం వల్ల ఎంత డేంజరో తెలుసా??? అయితే మీ అందరికోసం ఈ సమాచారం. మనం కారును నీడలో పార్క్ చేసినప్పుడు అన్ని డోర్స్ మూసేస్తాము. అలా మూసేసినప్పుడు మన కారులో 400-800 మిల్లీ గ్రాముల బెంజీన్ పేరుకుంటుంది. అదే ఎండలో పార్క్ చేసినప్పుడు, ఉదాహరణకి బయట ఉష్ణోగ్రత 16 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్లయితే బెంజీన్ ఉత్పత్తి అనేది 2000-4000 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది. ఇది అనుమతించిన స్థాయి కంటే 40 రెట్లు ఎక్కువ.
ఇక మన పనులు చూసుకుని వచ్చి, కారులో కూర్చోగానే అందులో ఇంతకుముందే ఉత్పత్తి అయిన బెంజీన్ వాయువుని తీసుకుంటున్నాం. వాస్తవానికి ఇలా తీసుకోటం వల్ల , ఈ బెంజీన్ అనేది మీ కాలేయ, ఎముక కణజాలం, మూత్రపిండాలు పైన ప్రభావితం చూపుతుంది. ఈ ప్రభావాన్ని నయం చెయ్యటానికి మన మానవ శరీరానికి చాలా సమయం పడుతుంది. ac స్టార్ట్ చేసేటప్పుడు కారు అద్దాలు దించమని మన కారు manual లో ఉంటుంది . కానీ మనం దాన్ని పెద్దగా పట్టించుకోము.
వైద్యపరమైన వివరణ.. మనం కారులో ac ని స్టార్ట్ చేసినప్పుడు అది చల్లని గాలి విడుదల చేసే ముందు ఇంజిన్ నుంచి వేడి గాలి కారులోకి వెలువడుతుంది. ఈ గాలిలో బెంజీన్ కలిసి ఉంటుంది. ఇది కాన్సర్ వ్యాధి ని కలిగించే క్రిములను మన శరీరంలో ఉత్పత్తి అవ్వటానికి దోహదపడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైన వాయువు. కాబట్టి, మీరు కారులో కూర్చున్న తర్వాత , వేడిచేసిన ప్లాస్టిక్ వాసనను గమనించినట్లైతే , కొన్ని నిమిషాల పాటు విండోలను తెరిచి ఆపై A / C ని స్టార్ట్ చెయ్యండి. కావున మీరు అందరు ఇలా చేసినట్లయితే మీరు మిమ్మల్ని, మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి ని రక్షించినవారు అవుతారు.. లేకపోతె పరిణామాలు ప్రాణాంతకం కావచ్చు.