information

సడెన్ గా కార్ బ్రేక్ ఫెయిల్ అయితే వెంటనే ఇలా చేయండి.. లేదంటే ప్రమాదమే..!!

సాధారణంగా మనం రోడ్డుపై కారులో ఏదైనా దూర ప్రయాణం చేసేటప్పుడు వేగంగా వెళుతూ ఉంటాం.. ఒక్కోసారి వంద కిలోమీటర్లకు పైగా వేగాన్ని పెంచుతూ దూసుకెళ్తారు.. ఈ సమయంలోనే ఏదైనా పెద్ద వాహనం అడ్డుగా వచ్చిందనుకోండి.. దీంతో బ్రేక్ వేసి కారు వేగాన్ని తగ్గించాలని భావిస్తాం..

కానీ ఆ సమయంలో అది సాధ్యం కాలేదు అనుకోండి, ఒకవేళ బ్రేకులు ఫెయిల్ అయితే డ్రైవింగ్ లో ఎంతటి ఘనుడైన భయపడాల్సిందే.. ఈ క్రమంలోనే చాలామంది స్టీరింగ్ కంట్రోల్ తప్పడం, అందులో ఉన్నటువంటి ప్రయాణికుల కేకలకు భయపడి ఇతర పొరపాట్లు చేస్తూ ఉంటారు.. కానీ ఆ సమయంలో బ్రేకులు ఫెయిల్ అయితే ముందుగా మనం ధైర్యంగా ఉండి ప్రమాదం నుంచి ఏ విధంగా గట్టెక్కాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

if your car breaks fail suddenly then do like this

సాధారణంగా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు మాత్రమే పార్కింగ్ లైట్లు వేస్తుంటారు.. ఇలా చేయడం వల్ల మన వెనక వచ్చే వాహనదారుడు మనకు ఏదో సమస్య వచ్చిందని అనుకుంటారు.. అప్పుడు మీ వాహనానికి దూరంగా వెళ్ళడమో పక్కకు వెళ్లడమో చేస్తారు.. వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేకులు పనిచేయకపోతే, వెంటనే గేర్ల ను మార్చండి.. ఒకవేళ టాప్ గేర్ లో ఉన్నట్లయితే ఫస్ట్ గేర్ వరకు తీసుకొని రావాలి. దీనివల్ల వేగం నియంత్రణకు వస్తుంది. ఆటోమేటిక్ కార్ లో అయినా ఇదే పరిస్థితి ఉంటుంది.. అలాగే ఐదో గేర్ లో ఉంటే తర్వాత నాలుగు తర్వాత మూడు అలా తగ్గించుకుంటూ రావడం వల్ల వేగం తగ్గుతుంది.

బ్రేక్ ఫెయిల్ అయినట్లయితే కార్ ను రోడ్డు మధ్యలో కాకుండా రోడ్డుకు చివరిభాగంలో డ్రైవింగ్ చేస్తూ ఉండటం వల్ల ప్రమాదం చాలా తక్కువగా జరుగుతుంది.ఒకవేళ అత్యవసరం అనుకుంటే మాత్రం హ్యాండ్ బ్రేక్స్ ను యూజ్‌ చేయాలి. ముందుగా పైన చెప్పిన పద్దతులన్నీ పాటించిన తర్వాత చివరి సమయంలో హ్యాండ్ బ్రేక్ వాడాల్సి ఉంటుంది.. ఒకవేళ బ్రేకులు ఫెయిల్ అయిన వెంటనే కంగారుపడి వేగంగా కారు హ్యాండ్ బ్రేక్ వేస్తే మాత్రం కారు రోడ్డుపైనే పల్టీలు కొట్టే అవకాశం ఉంటుంది.

Admin

Recent Posts