information

విదేశీ భాష‌ను నేర్చుకోండి.. నెల నెలా ల‌క్ష‌లు సంపాదించండి…!

ఒక‌ప్ప‌టిలా ఇప్పుడు కాలం లేదు. కాలం వేగంగా మారుతోంది. దీంతో అన్ని రంగాల్లోనూ విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు వ‌స్తున్నాయి. ఫ‌లితంగా మ‌న‌కు వేగంగా సేవ‌లు కూడా అందుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఏ రంగం చూసినా అందులో ఉద్యోగాల ప‌రంగా అయితే చాలా పోటీ నెల‌కొంద‌ని చెప్ప‌వ‌చ్చు. అత్తెస‌రు మార్కులతో పాస్ అయితే అస‌లు జాబ్ మీద ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. అంత‌టి పోటీ ఉద్యోగ రంగంలో ఉంది. ఈ క్ర‌మంలోనే కేవ‌లం ఒక్క రంగం అనే కాకుండా చాలా రంగాల్లో ఉద్యోగాల్లో పోటీ నెలకొంది.

ఏ రంగాన్ని తీసుకున్నా స‌రే నైపుణ్యం ఉన్న‌వారికే కంపెనీలు లేదా సంస్థ‌లు భారీ జీతాలు ఇచ్చి మ‌రీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అయితే స్కిల్ స‌రిగ్గా లేనివారు ఏదో ఒక జాబ్ చేయాల్సి వ‌స్తోంది. దీంతో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉన్న‌ప్ప‌టికీ చాలా మంది టెన్త్‌, ఇంట‌ర్ అర్హ‌త ఉన్న జాబ్స్ చేస్తున్నారు. అంత‌లా పోటీ ఉద్యోగ రంగంలో ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే కాలం మారేకొద్దీ అభ్య‌ర్థులు కూడా మారాలి. ఆ యుగానికి అనువుగా ఉన్న కొలువుల‌ను ఎంపిక చేసుకుని వాటిల్లో చేరాలి. అయితే అలాంటి ఉద్యోగాల విష‌యానికి వ‌స్తే ట్రాన్స్‌లేట‌ర్ ఉద్యోగం ప్ర‌స్తుతం చాలా బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు.

స‌ర్టిఫికెట్ కోర్సు చేయాలి..

విదేశీ భాష‌ల‌ను గ‌న‌క యువ‌త నేర్చుకుని స‌ర్టికేష‌న్ చేస్తే ట్రాన్స్‌లేట‌ర్‌గా గొప్ప అవ‌కాశం పొంద‌వ‌చ్చు. ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు కంపెనీలు ట్రాన్స్‌లేట‌ర్ ఉద్యోగాల‌కు భారీగానే చెల్లిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ట్రాన్స్‌లేట‌ర్లు ప్ర‌స్తుతం నెల‌కు రూ.40వేల నుంచి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు సంపాదిస్తున్నారు. అయితే ట్రాన్స్‌లేట‌ర్ అవ్వాలంటే క‌ష్ట‌ప‌డి చ‌దివి ఆ భాష‌లో క‌నీసం స‌ర్టిఫికెట్ కోర్సును అయినా చేయాలి. ఇందుకు గాను మ‌న‌కు ప‌లు ఇనిస్టిట్యూట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివ‌రాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలిస్తే..

learn foreign languages you can earn good income

మ‌న దేశంలో కొన్ని విద్యాసంస్థ‌లు విదేశీ విద్య‌పై ప‌లు స్పెష‌ల్ కోర్సుల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. విదేశీ భాష‌ల్లో ఇక్కడి అభ్య‌ర్థులు ప్రావీణ్య‌త‌ను సంపాదించ‌వ‌చ్చు. వాటిల్లో డిగ్రీ, డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. విదేశీ భాష‌ల్లో క‌నీసం డిప్లొమా కోర్సును అయినా చేస్తే చాలు.. దాంతో ట్రాన్స్ లేట‌ర్ లేదా కంటెంట్ రైట‌ర్‌గా కూడా ఉద్యోగం పొంద‌వ‌చ్చు. అయితే ఆయా కోర్సుల్లో చేరితే చాలదు, విదేశీ భాష‌ల‌ను నేర్చుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది క‌నుక వాటిలో ప్రావీణ్య‌త‌ను సాదించాల్సి ఉంటుంది. అప్పుడే జాబ్ ఆఫ‌ర్లు వెదుక్కుంటూ వ‌స్తాయి.

అనేక రంగాల్లో జాబ్స్‌..

విదేశీ భాష‌లను నేర్చుకుంటే కేవ‌లం ట్రాన్స్‌లేట‌ర్‌, కంటెంట్ రైట‌ర్‌గానే కాదు.. ప‌లు ఇత‌ర రంగాల్లోనూ ఉద్యోగాలను సాధించ‌వ‌చ్చు. ముఖ్యంగా ఇంట‌ర్ ప్రిట‌ర్‌, లాంగ్వేజ్ ఎక్స్‌ప‌ర్ట్‌, క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ ఎక్స్‌ప‌ర్ట్‌, డిజిట‌ల్ మార్కెటింగ్‌, మీడియా మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లోనూ ఉద్యోగాల‌ను సాధించ‌వ‌చ్చు. ఇక ప్ర‌పంచ భాష‌ల‌కు ఆద‌ర‌ణ ఉంద‌ని చెప్పి దేన్ని పడితే దాన్ని నేర్చుకోకూడ‌దు. కేవ‌లం కొన్ని విదేశీ భాష‌ల‌కు మాత్ర‌మే ప్ర‌స్తుతం ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇక ఆ భాష‌లు ఏమిటంటే.. ఫ్రెంచ్‌, జ‌ర్మ‌న్‌, స్పానిష్‌, జ‌ప‌నీస్‌, చైనీస్‌, రష్య‌న్ వంటి భాష‌ల‌ను నేర్చుకుంటే ఎన్నో ఉద్యోగాల‌ను ఆయా రంగాల్లో సాధించ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. క‌నుక మీరు కూడా విదేశీ భాష‌లను నేర్చుకోవ‌డం మొద‌లు పెట్టండి. దీంతో ఏదైనా ఒక రంగంలో ఉద్యోగం సాధించ‌వ‌చ్చు.

Admin

Recent Posts