మా సింక్ కుళాయి కారుతోంది… నిన్న నేను మా ప్లంబర్‌కి ఫోన్ చేసి ట్యాప్ లో వాచర్ కొత్తది పెట్టమని చెప్పా. అతను..సార్… వాచర్ కాదు, స్పిండిల్ మార్చాలి.. అన్నాడు! నా చిన్నతనంలో, నేను చూశాను… లీక్ అవుతున్న నీటి కుళాయి కోసం, ప్లంబర్ వచ్చి కుళాయి తెరిచి, కొత్త రబ్బరు వాచర్ పెట్టేవాడు, అది నీరు కారడాన్ని ఆపేది … కుళాయి యథావిధిగా పనిచేసేది. కొన్ని ఇళ్లలో కొంతమంది పెద్దవారు వాచర్‌లను తమంత తామే మార్చుకోవడం నేను చూశాను… సులభమైన పని. ఆ రోజుల్లో ఈ వాచర్ ఖరీదు 50 పైసలు… ఇప్పుడు అది మహా ఉంటే 1 రూపాయి కావచ్చు. ఇప్పుడు ఈ ప్లంబింగ్ కంపెనీలు చాలా తెలివైనవిగా మారాయి… కంపెనీలు నీటి లీకేజీని ఆపడానికి రూ. 1/- బదులుగా రూ.100/- ఖర్చు చేసేలా కొన్ని కొత్త ఆలోచనలను ఉపయోగించడం ప్రారంభించారు. ఇక్కడ క్రింద ఉన్న ఫోటో చూడండి.
ముందు వాచర్ స్వతంత్రంగా ఉండేది… అది స్పిండిల్ పై కూర్చునేది. ఇప్పుడు తయారీదారులు, నాకు అనిపిస్తున్నది ఏంటంటే, వాచర్ స్పిండిల్ లోపట పొందు పరిచిన భాగంగా మార్చి దీన్ని రూపొందిస్తు న్నారు! కాబట్టి మీరు వాచర్‌ను మార్చాలనుకుంటే (రూ.1/- ఖర్చు చేసి) మీరు చేయలేరు. మీరు వంద రూపాయలు ఖర్చు చేసి కొత్త స్పిండిల్‌ను కొనుగోలు చేయాల్సిందే.. మరో మార్గం లేదు…. మరి దీన్ని ఏమంటారు?
కనీసం ఆరంభంలో ఒక 20 సంవత్సరాలకు గాను సాఫ్ట్వేర్ అప్డేట్ లను ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండే విధంగా, ఒక ఉత్పత్తిని, దానికి అనుగుణమైన ధరలతో ఆపిల్ ఎందుకు తీసుకుని రాదు? ఆస్తమానం సాఫ్ట్వేర్ మారుస్తూ ఉండటం వల్ల ఆ పరికరంలోని వాడిన హార్డ్వేర్ దానిని ఎల్లకాలం సపోర్ట్ చేయలేదు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ మాట అంటున్నాను. ప్రతి ఐదు-పది సంవత్సరాలకు మారకం (ఎక్స్చేంజ్) పద్ధతి లో కొత్త ఐప్యాడ్, కొత్త మాక్ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఎందుకు తీసుకోవాలి? ఇదంతా మాయ.