Skip to content
Ayurvedam365
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆహారం
  • డ్రింక్స్‌
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా

Savings Account Deposit Rules : ఒక సేవింగ్స్ ఖాతాలో ఎంత డ‌బ్బు ఉంచ‌వ‌చ్చు..? ఇన్‌క‌మ్ ట్యాక్స్ రూల్స్ తెలుసా..?

February 5, 2025 by Admin

Savings Account Deposit Rules : దేశంలో ఉన్న ఎవ‌రైనా స‌రే ఏ బ్యాంకులో అయినా స‌రే సేవింగ్స్ ఖాతాల‌ను తెర‌వ‌వ‌చ్చు. కొంద‌రు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాల‌ను తెరుస్తారు. ఇంకొంద‌రు ప్రైవేటు బ్యాంకుల్లో అకౌంట్ల‌ను నిర్వ‌హిస్తారు. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు అయితే చార్జిలు కూడా త‌క్కువ‌గానే ఉంటాయి. పొర‌పాటున మినిమం బ్యాలెన్స్ పెట్ట‌క‌పోయినా పెద్ద‌గా ఛార్జిల‌ను విధించ‌రు. అయితే ప్రైవేటు బ్యాంకుల్లో దాదాపుగా అన్ని ర‌కాల చార్జిలు ఎక్కువ‌గానే ఉంటాయి.

ఇక ఇన్‌క‌మ్‌ట్యాక్స్ రూల్స్ విష‌యానికి వ‌స్తే ఒక వ్య‌క్తి ఎన్ని సేవింగ్స్ ఖాతాల‌ను అయినా క‌లిగి ఉండ‌వ‌చ్చు. అందుకు ప‌రిమితి అంటూ ఏమీ లేదు. మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసే కెపాసిటీ ఉంటే ఒకరు ఎన్ని సేవింగ్స్ అకౌంట్ల‌ను అయినా స‌రే ఓపెన్ చేయ‌వ‌చ్చు. అందుకు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు బ్యాంకులు అని ఏమీ రూల్స్ ఉండ‌వు. ఏ బ్యాంకులో అయినా ఎన్ని ఖాతాల‌ను అయినా తెర‌వ‌వ‌చ్చు. ఇక జీరో బ్యాలెన్స్ అకౌంట్ల‌లో మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన ప‌నిలేదు.

Savings Account Deposit Rules how much money per account is okay

అకౌంట్‌లో ఎంత డ‌బ్బును క‌లిగి ఉండ‌వ‌చ్చు..?

అయితే సాధార‌ణంగా ఒక‌టి క‌న్నా ఎక్కువ సేవింగ్స్ ఖాతాల‌ను క‌లిగి ఉన్న‌వారికి ఎప్పుడూ ఒక సందేహం వ‌స్తుంటుంది. అది ఏమిటంటే.. ఒక సేవింగ్స్ ఖాతాలో ఎంత మొత్తంలో డ‌బ్బును క‌లిగి ఉండ‌వ‌చ్చు.. అని సందేహిస్తుంటారు. అయితే ఎవ‌రైనా త‌మ అకౌంట్ల‌లో ఎంత డ‌బ్బును అయినా స‌రే క‌లిగి ఉండ‌వ‌చ్చు. అందుకు లిమిట్ అంటూ ఏమీ లేదు. కానీ ఒక వ్య‌క్తి ఒక అకౌంట్‌లో ఒక ఏడాదిలో రూ.10 ల‌క్ష‌ల‌కు మించి న‌గ‌దును డిపాజిట్ చేస్తే మాత్రం ఆ విష‌యాన్ని బ్యాంకులు సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వారికి తెలియ‌జేస్తాయి.

ఈ క్ర‌మంలో స‌ద‌రు డిపార్ట్‌మెంట్ వారు మీకు నోటీసులు ఇస్తారు. ఆ ఆదాయం ఎలా వ‌చ్చిదో చెప్పాల్సి ఉంటుంది. అయితే మీరు చెప్పే స‌మాధానానికి వారు సంతృప్తి చెందితే ఫ‌ర్వాలేదు. లేదంటే మీకు పెనాల్టీ విధిస్తారు. అది చాలా భారీ ఎత్తున ఉంటుంది. మీకు ఆదాయం ఎలా వ‌చ్చిందో మీరు స‌రిగ్గా చెప్ప‌క‌పోతే మీకు వ‌చ్చిన ఆదాయంపై ఏకంగా వారు 60 శాతం మేర ప‌న్ను విధిస్తారు. దానిపై 25 శాతం స‌ర్‌చార్జి క‌ట్టాలి. మ‌రో 4 శాతం సెస్ కూడా వ‌సూలు చేస్తారు. క‌నుక బ్యాంకుల్లో రూ.10 ల‌క్ష‌ల‌కు మించి చేసే న‌గ‌దు లావాదేవీల‌పై ఎవ‌రైనా స‌రే జాగ్ర‌త్త‌గా ఉండాలి.

రూ.10 ల‌క్ష‌ల‌కు మించితే..?

ఇక ఈ నియ‌మం క్యాష్ డిపాజిట్ల‌కే కాదు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యుచువ‌ల్ ఫండ్ పెట్టుడులు, బాండ్స్‌, షేర్ల పెట్టుబ‌డులకు కూడా వ‌ర్తిస్తుంది. అంటే వీటిల్లో కూడా మీరు ఒక ఏడాదిలో రూ.10 ల‌క్ష‌ల‌కు మించి పెట్టుబ‌డి పెడితే ఆ విష‌యాన్ని స‌ద‌రు కంపెనీ వారు సీబీడీటీకి తెలియ‌జేస్తారు. అప్పుడు కూడా మీకు పైన చెప్పిన విధంగా నోటీసులు వ‌స్తాయి. క‌నుక ఏ విష‌యంలో అయినా మీరు చేసే రూ.10 ల‌క్ష‌ల‌కు మించి లావాదేవీల‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.

ఇక మీకు సేవింగ్స్ ఖాతా లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వ‌చ్చే వ‌డ్డీ ఏడాదికి రూ.10వేల లోపు ఉంటే మీరు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన ప‌నిలేదు. ఒక వేళ వ‌డ్డీలో టీడీఎస్ క‌ట్ చేసినా మీకు రూ.10వేల లోపు వ‌డ్డీ వ‌స్తే అప్పుడు మీరు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 80టిటిఎ ప్ర‌కారం మిన‌హాయింపు తీసుకోవ‌చ్చు. దీంతో మీరు ఐటీ రిట‌ర్న్స్ ఫైల్ చేసిన‌ప్పుడు స‌ద‌రు టీడీసీ క‌ట్ అయిన మొత్తాన్ని మ‌ళ్లీ వెన‌క్కి క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. దీంతో ఇన్‌క‌మ్ ట్యాక్స్ వారు క‌ట్ చేసిన టీడీఎస్ మొత్తాన్ని రీఫండ్ ఇస్తారు. అయితే మీకు వ‌చ్చే వ‌డ్డీ విలువ ఏడాదికి రూ.10వేల క‌న్నా ఎక్కువ ఉంటే మాత్రం మీరు ప‌న్ను చెల్లించాల్సిందే. కానీ 60 ఏళ్ల పైబ‌డిన వారికి మాత్రం ఈ విష‌యంలో రూ.50వేల వ‌ర‌కు మిన‌హాయింపు ఉంటుంది. అంటే వారికి సేవింగ్స్ ఖాతా లేదా ఎఫ్‌డీల మీద ఏడాదికి వ‌చ్చే వ‌డ్డీ రూ.50వేలు అంత‌క‌న్నా త‌క్కువ ఉంటే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన ప‌నిలేదు. కానీ రూ.50వేల‌కు మించితే మాత్రం వారు కూడా ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

Categories information, వార్త‌లు Tags Savings Account Deposit Rules
“అమెజాన్”లో ఒకోసారి “చిన్న వస్తువు” కొన్నా “పెద్ద బాక్స్” లో వస్తుంది.! ఎందుకో తెలుసా.? 4 కారణాలు ఇవే.!
Liquor Limit At Home : ఒక వ్య‌క్తి త‌న ఇంట్లో గ‌రిష్టంగా ఎన్ని లీట‌ర్ల మేర మ‌ద్యాన్ని నిల్వ చేసుకోవ‌చ్చు..?

LATEST NEWS

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

వివాహం ఆలస్యం అవుతున్న అబ్బాయిలు మీకోసమే.. ఇలా చేస్తే త్వరగా వివాహం అవుతుంది..!!

September 23, 2025

చాణక్య నీతి ప్రకారం ఇతరులని మన దారిలోకి తెచ్చుకోవాలంటే 5 చిట్కాలు పాటించండి..!

September 23, 2025

ఆర్ఆర్ఆర్ లో ఈ మిస్టేక్ గమనించారా.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు జక్కన్న..?

September 22, 2025

అప్పుల బాధ నుండి బయటపడాలంటే ఎవరికీ పొరపాటున కూడా ఇవి దానం చేయకండి..!

September 22, 2025

© 2026 Ayurvedam365 • Built with GeneratePress