Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

ప్ర‌పంచానికి మ‌ద‌ర్ థెరిస్సా చెప్పిన అద్భుత‌మైన సూక్తులు, సందేశాలు ఇవే..!

Admin by Admin
May 14, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మ‌ద‌ర్ థెరిస్సా గురించి అంద‌రికీ తెలిసిందే. ఈమెది వేరే దేశం అయిన‌ప్ప‌టికీ మ‌న దేశాన్ని ప్రేమించింది. ఇక్క‌డ ఉన్న పేద‌ల‌కు, అనాథ పిల్ల‌ల‌కు ఎంత‌గానో సేవ‌లు చేసింది. అందుక‌నే సేవాగుణాన్ని ఆమె నుంచి పుణికి పుచ్చుకోవాల‌ని చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే మ‌ద‌ర్ థెరిస్సా ప్ర‌పంచానికి అనేక సందేశాలు ఇచ్చింది. వాటి వివ‌రాల‌ను ఇప్పుడు చూద్దాం. నేను విరుద్ధ స్వభావమును కనుగొన్నాను, అది మిమ్మల్ని బాధించేవరకు మీరు ప్రేమిస్తే, అక్కడ ఏ బాధా ఉండదు, మరింత ప్రేమ తప్ప. ప్రేమ ఎల్లప్పుడూ లభించే పండు వంటిది, అది ప్రతి ఒక్కరి వరకూ చేరుకుంటుంది. ప్రేమ సన్నిహితమైన వాటిని చూసుకోవటం ద్వారా ప్రారంభమవుతుంది. పేదరికం, వ్యాధులు చంద్రుడిలో కూడా ఉంటే గనుక అక్కడకు వెళ్లి కూడా సేవ చేసేందుకు సిద్ధంగా వున్నాను. నువ్వు ఇతరులలోని లోపాలను వెతకడం ప్రారంభిస్తే ఎవరినీ ప్రేమించలేవు.

దేనినైనా ప్రేమతో చేసి చూడండి, అది మీ జీవితాన్ని సంతోషపరుస్తుంది, మనుష్యులలో తప్పొప్పులు చూస్తూ వుంటే, ఒక రోజు నీకు ప్రేమ చూపేందుకు అవకాశమే దొరకదు. మౌనం యొక్క ఫలితం ప్రార్ధన, ప్రార్ధన యొక్క ఫలితం నమ్మకం, నమ్మకం యొక్క ఫలితం ప్రేమ, ప్రేమ యొక్క ఫలితం సేవ, సేవ యొక్క ఫలితం సంతృప్తి. మనం గొప్పగొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసే కొన్ని పనులు గొప్ప మనస్సుతో చేస్తే చాలు. పేదలను సేవిస్తే పరమాత్మను సేవించినట్టే. శాంతి ఒక చిరునవ్వుతో ప్రారంభమవుతుంది, ఇతరులను సేవించుట వలన ఏర్పడే సంతోషం అమూల్యమైనది. ప్రేమను చూపించేందుకు, ప్రేమను పొందే ఒకే ఒక ఉద్దేశ్యంతోనే దేవుడు మనల్నందరినీ సృష్టించియున్నాడు. ప్రేమ శాంతిని ఏర్పరుస్తుంది, ఎందుకంటే అది జాతికి, మతానికి అతీతమైనది, పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే ఈ ప్రపంచంలో ఐకమత్యానికి దారి చూపగలదు. మీరు ఎల్లప్పుడూ ఇతరులను చిరునవ్వుతో పలకరించండి, ఎందుకంటే ప్రేమ ప్రారంభమయ్యేది చిరునవ్వుతోనే. మనం మాట్లాడే ప్రతి మాట ప్రేమతో నిండి ఉండాలి.

mother teresa told these to the world

సహాయం చేయడానికి ఉండాల్సింది డబ్బు కాదు, మంచి మనసు, మనకు శాంతి లేకపోతే, మనం ఒకరికొకరు చెందినవారమని మర్చిపోతాము, శాంతిని నాశనం చేసేది గర్భస్రావం, ఎందుకంటే ఒక తల్లి తన సొంత బిడ్డని చంపివేస్తే, నన్ను చంపడానికి నీవు, నిన్ను చంపడానికి నేను తప్ప మన మధ్య మరేమీ మిగలదు? మనం చేస్తున్నది సముద్రంలో ఒక నీటిబిందువు వలె భావిస్తాము, కానీ కోల్పోయిన ఆ నీటి బిందువు కారణంగా సముద్రం తక్కువగా కనిపిస్తుంది. నువ్వు విజయాలు సాధించినప్పుడు కొందరు నిజమైన మిత్రులు, కొందరు బూటకపు మిత్రులు నీ చెంత చేరవచ్చు, అయినా విజయం సాధించు.

మనం దేవుణ్ణి కనుగొనవలసి ఉంది, అతను శబ్దం మరియు విశ్రాంతి లేకపోవడం వల్ల కనుగొనబడలేదు, దేవుడు మౌనం యొక్క స్నేహితుడు, ప్రకృతి – చెట్లు, పువ్వులు, గడ్డి – మౌనంగా ఎలా పెరుగుతాయో చూడండి, నక్షత్రాలు, చంద్రుడు మరియు సూర్యుడు నిశ్శబ్దంలో ఎలా కదిలివస్తారో చూడండి, కాబట్టి మనం ఆత్మలను తాకేలా మౌనంగా ఉండాలి. ప్రోత్సాహం లేదని మంచి పనిని వాయిదా వేయకండి. ప్రతి వాళ్ళు గొప్ప సేవలు చెయ్యలేకపోవచ్చు, కానీ చేసిన చిన్న సేవ గొప్పగా ఉండాలి. ఒంటరితనం మరియు అవాంఛనీయ భావన చాలా భయంకరమైన పేదరికం. కొన్నిసార్లు మనం పేదరికం వల్లే ఆకలి, బట్టలు లేకపోవడం మరియు నిరాశ్రయులై ఉంటామని భావిస్తాము, అవాంఛనీయ, ఇష్టప్రకారం మరియు అక్కరలేని పేదరికం అసలైన పేదరికం, ఈ రకమైన పేదరికాన్ని నిర్మూలించడo మన ఇంటి నుండే ప్రారంభం కావాలి.

మనకు ఎప్పటికీ తెలియదు, అన్ని మంచి పనులు ఒక సాధారణ చిరునవ్వుతో చేయవచ్చని, ఓ కుష్ఠు వ్యాధిగ్రస్తుని దేహాన్ని తాకేటప్పుడు దేవుణ్ణి తాకుతున్నట్లే భావిస్తున్నా. మీరు వంద మందికి ఆహారాన్ని పెట్టలేకపోవచ్చు, కానీ కనీసం ఒక్కరికైనా తినిపించండి, అన్నం లేకపోవడం కన్నా ఆప్యాయత కరువవడం అసలైన పేదరికం. నేడు పెద్ద వ్యాధి కుష్ఠురోగమో లేదా క్షయవ్యాధి కాదు, అవాంఛనీయ భావనే అతిపెద్ద వ్యాధి. ఎవరికి ఎవరూ ఉండకపోవటం అనేది గొప్ప వ్యాధుల్లో ఒకటి. రోజూ ఆలయాలకు వెళ్ళి పూజలు చేసే కన్నా, నెలకోసారి ఒక పేద రోగికి తోచిన సాయం చేస్తేనే ఎక్కువ పుణ్యం వస్తుంది. ఎవరికీ అవసరములేని వ్యక్తిగా ఒంటరితనము అన్న భావనలో జీవించువాడు అత్యంత పేదవాడు.

పదే పదే ప్రార్ధించడం కన్నా పరోపకారానికి కొంత సమయం కేటాయించడం మిన్న. మనిషిని పట్టి పీడించే పెద్ద వ్యాధి కుష్టు రోగమో, క్షయనో కాదు, తాను ఎవరికీ అక్కర్లేదనే భావనే. ప్రశాంతమైన మనసు ఉన్నవారు అనుకున్నది సాధిస్తారు. చిన్నపాటి విషయాలలోనే నమ్మకoగా ఉoడoడి, ఎoదుకoటే వాటిలోనే మీరు మీ బలాన్ని కలిగి ఉంటారు. ఆకలిగా ఉన్న పేదవారికి అన్నం పెట్టినంత పుణ్యకార్యం మరోటి లేదు. ఆహరం రుచిగా లేదని ఫిర్యాదు చేసే ముందు తినటానికి ఏమీలేని పేదల గురించి ఆలోచించు. వందమందికి నీవు సహాయ పడలేక పోవచ్చు, కానీ కనీసం ఒక్కరికైనా సహాయపడు. నువ్వు సూటిగా , నిజాయితీగా వ్యవహరించినా ప్రజలు నిన్ను మోసగించవచ్చు. అయినా నువ్వు సూటిగా, నిజాయితీగా ఉండు. ఎదుటివారిని చూసి ప్రేమ పూర్వకంగా నవ్వగలిగితే అదే వారికి మీరిచ్చే అందమైన బహుమతి.

Tags: mother teresa
Previous Post

చిన్న‌ప్పుడు త‌న కొడుకు దొంగ‌త‌నం చేస్తే మంద‌లించ‌ని తల్లి.. త‌రువాత ఏం జ‌రిగిందో చూడండి..

Next Post

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మంచి ఔష‌ధం ఇది..

Related Posts

హెల్త్ టిప్స్

స‌న్న‌గా ఉన్న‌వారు బ‌రువు పెర‌గాలి అనుకుంటున్నారా.. అయితే వీటిని తినండి..!

June 14, 2025
ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!